ఆర్టికల్ 370, ఎందుకూ…

 

https://www.facebook.com/bestpagi/videos/847983032229379/?t=16

ఆర్టికల్ 370, ఎందుకూ

భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆర్టికల్ 370 జమ్మూ
కశ్మీర్ కు మాత్రమే ఎందుకు?.. ఈ అధికరం ఉండాలని వాదిస్తున్న మేధావులు డొంక తిరుగుడు లేకుండా చెప్పగలరా? జమ్మూ కశ్మీర్ భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయింది.. అలాంటి సమస్యే ఉన్న హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలు కూడా ఇంచుమించు అదే సమయంలో విలీనం అయ్యాయి.. మరి మిగతా రెండు ప్రాంతాలకు ఎందుకు ఆర్టికల్ 370 ఇవ్వలేదు?..

కశ్మీర్లో వేర్పాటు వాదానికి, ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నది ఆర్టికల్ 370 అని ఎంత మందికి తెలుసు?.. భారత దేశంలో ఉండేవారు ఏ ప్రాంతానికైనా వెళ్లి స్వేచ్చగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందొచ్చు.. వివాహం, ఆస్తుల విషయంలో ఎలాంటి నియంత్రణలు లేదు.. కానీ కశ్మీర్ ప్రాంతానికి ఇవేవీ వర్తించవు.. భారత దేశ చట్టాలేవీ నేరుగా అక్కడ అమలు కావు.. ఇంకా చెప్పాలంటే చాలా విచిత్రాలు కనిపిస్తాయి.

ఆర్టికల్ 370లో ఏముంది….
– జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించినదే ఆర్టికల్ 370.
– జమ్ము కాశ్మీర్ కు భారత్ లో ప్రత్యేక ప్రతిపత్తిని కేటాయించింది. భారతలొ అన్ని రాష్ట్రాల మాదిరిగా కాకుండా దాన్ని మాత్రం విడదీసింది.
– దీని ప్రకారం జమ్ము కాశ్మీర్ లో 1935 భారత చట్టం వర్తిస్తుంది
– పార్లమెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి సంబందించిన కొత్తగా ప్రాంతాలను జోడించడం లేదా విడదీయడం కుదరదు.
– కాశ్మీర్ లో వేరే వ్యక్తులు(కాశ్మీర్ వాళ్లు కాని వాళ్లు) ఎలాంటి ఆస్తులు కొనడానికి వీలులేదు.

అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ కమిటీ రాజ్యాంగాన్ని రచించినప్పటికీ, ఆర్టికల్ 370 రూపకర్త మాత్రం ఒక తంజావూరు బ్రాహ్మణుడు అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుందేమో గానీ అది నిజం. అప్పటి కాశ్మీరు రాజు మహారాజా హరిసింగ్ దివాణంలో దివాన్ గా పని చేసిన తంజావూరు బ్రాహ్మణుడు గోపాలస్వామి అయ్యంగార్ ఆర్టికల్ 370 రచయిత. అటు కాశ్మీర్ నేత షేక్ అబ్దుల్లా మరియు ఇతర కాశ్మీర్ నేతలతోనూ, ఇటు భారత ప్రధాని నెహ్రూ, హోమ్ మంత్రి పటేల్ తోనూ విస్తృతమైన చర్చలు జరిగాయి.

అయ్యంగార్ ఆర్టికల్ 370ని తీసుకురావడానికి ఓ రాజకీయ కారణం కూడా ఉంది. కాశ్మీర్ భూభాగాన్ని మిగిలిన అన్ని రాజ్యాల భూభాల మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా ఉంచాలని అనుకున్నారు. అందులో భాగంగా భారత ప్రభుత్వం ప్రమేయాన్ని తగ్గిస్తూ స్థానిక రాజుకు కొన్ని అధికారాలను కట్టబెట్టాలని అనుకున్నారు. అసలు స్వయం ప్రతిపత్తి ఎందుకు అనే ప్రశ్నకు అయ్యంగార్ సమాధానం ఎవరిని సంతృప్తిపరచలేదు. ఎందుకు అంటే ఆయన సమాధానం ఏంటంటే..అనేక కారణాల రీత్యా భారత దేశంలో విలీనం కావడానికి కాశ్మీర్ లో పరిస్ధితులు పండలేదని అయ్యంగార్ చెప్పారు. కానీ అది ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కాబట్టి ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కాశ్మీర్ ను భారత్ లో కలిపి ఆర్టికల్ 370 లేకుండా చూడాల్సింది.

ఈ నేపధ్యంలో కాశ్మీర్ ప్రజల ప్రతినిధిగా భావించిన షేక్ అబ్దుల్లా, పటేల్, నెహ్రూ లతో చర్చించి ఆర్టికల్ 370 ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. ఇది కాకుండా మహారాజా హరిసింగ్ తో భారత ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఆర్టికల్ 370 కి పునాది ఈ ఒప్పందమే. ఈ ఒప్పందం ప్రకారం జమ్ము & కాశ్మీర్ కేవలం పాక్షికంగానే విలీనం అవుతుంది. ఆచరణలో అది ప్రత్యేక దేశంగానే ఉంటుంది. భారత్ యూనియన్ చేతికి మూడు శాఖలు (విదేశీ, రక్షణ, సమాచార -వీటికి అనుబంధమైనవి) మాత్రమే అప్పగిస్తారు. కాశ్మీర్ కు ప్రధాని, రాష్ట్రపతి ఉంటారు. ఈ ఒప్పందం 1947 అక్టోబర్ లో కుదిరింది.

ఏప్రిల్ 1948లో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం ప్రకారం జమ్ము & కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ (ఫ్లెబిసైట్) నిర్వహించాలి. ఇండియాలో కలవాడమా, పాకిస్ధాన్ లో కలవాడమా అన్నది ఈ ఫ్లెబిసైట్ ద్వారా తేల్చాలి. ఈ తీర్మానానికి కట్టుబడి ఉంటామని భారత్, పాక్ ఇరు దేశాలు అంగీకరించాయి. అనంతరం దాన్ని బుట్టదాఖలు చేశాయి. దాంతో అప్పటి నుండి కాశ్మీర్ రగులుతూనే ఉంది. ఆర్టికల్ 370ని తీసుకువచ్చిన తీరు ఎలా ఉన్నా ఇప్పుడు ఎన్నికలు ఉన్న ప్రతిసారి దీనిపై ప్రచారాలు సాగుతూనే ఉంటాయి.

కాశ్మీర్ లో ప్రతి శుక్రవారం ఓ ఘటన జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఘటన జరుగుతూనే ఉంటుంది. ఎంతో మంది ఈ ఘటనకు రక్తం చిందించినా కూడా ఇప్పటికీ ఆ ఘటన జరుగుతోంది. అసలు శుక్రవారం ఏం జరుగుతుందో రేపటి భాగంగలో తెలుసుకుందాం

About The Author