మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు
అడవుల సంరక్షణకు అటవీ చట్టంలో సమూల మార్పులు తీసుకువచ్చి, వాటిని మరింత కఠినతరం చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.సోమవారం ఉదయం సచివాలయం డీ బ్లాక్‌లోని తన చాంబర్లో మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….సీయం కేసీఆర్ రెంవడసారి తనను మంత్రిగా నియమించడంతో తన భాద్యత మరింత పెరిగిందని, సీఎం కేసీఆర్‌కు తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కష్టపడుతానని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు అటవీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి అడవుల సంరక్షణకు చర్యలు చేపడతామన్నారు. అటవీ శాఖ పై సీఎం ఇప్పటికే రివ్యూ చేశారని… జంగల్ బచావో, జంగల్ బడావో పేరుతో ప్రజలల్లో మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు.అడవులను కాపాడటం, పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేవాదాయ శాఖగా మంత్రిగా ఉన్నవారు మళ్లీ ఎన్నికల్లో గెలవరు అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేశానని, దేవాదాయ శాఖ మంత్రిగా సీయం కేసీఆర్ రెండవసారి భాద్యతలను అప్పగించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఆలయాల అభివృద్దితో పాటు భక్తులకు మెరుగైన సేవలను అందిచేందుకు మరింత కృషి చేస్తామన్నారు. మే 1 నుండి అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. 2 కోట్ల పది లక్షలు ప్రతి నెల 3వేల 645 దేవాలయాలకు దూప దీప నైవేద్య పథకం ద్వారా చెల్లిస్తున్నామని వెల్లడించారు. సీయం కేసీఆర్ కృషి వల్ల హైకోర్టు విభజనతో ప్రధాన సమస్య తీరిపోయిందన్నారు. కొత్త జిల్లాలో జిల్లా కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్యేలు కోనేరు కోణప్ప, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, ఈ.ఎఫ్.ఎస్ & టి స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్,న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, ప్రభుత్వ సలహాదారు రమణచారి,దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస రావు,రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, డిఫ్యూటీ కమిషనర్ రామకృష్ణ,వీటీడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, యాదగిరిగుట్ట ఈవో గీతా రెడ్డి, వేములవాడ ఈవో రాజేశ్వర్, తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.మంత్రిగా రెండవసారి భాద్యతలు స్వీకరించిన ఇంద్రకరణ్ రెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిదులు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్యేలు కోనేరు కోణప్ప, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జ్ డి. విఠల్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, సీనియర్ నేతలు ముత్యంరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి, భూమన్న, మధుకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.