బి సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం అద్యక్షతన బి సి స్టడీ సర్కిల్ సోసైటీ…
సచివాలయంలో బి సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం అద్యక్షతన బి సి స్టడీ సర్కిల్ సోసైటీ మేనెజేమెంట్ కమిటీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమీక్షా సమావేశంలో బి సి స్టడీ సెంటర్ల ను మరింత బలోపేతం చేయటానికి సంబందిత అధికారులకు దిశా నిర్ధేశనం చేసారు బి సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం.బి సి స్టడీ సర్కిల్ నిర్వహణ, విద్యార్ధులకు మెరుగైన నైపుణ్య శిక్షణ, వివిధ రకాల పోటి పరీక్షలకు అవసరమైన మౌళిక శిక్షణల పై స్టడీ సర్కిల్ అదికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు బుర్ర వెంకటేశం.ఇదివరకు జరిగిన మేనెజేమెంట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను బి సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్ బాలాచారి కమిటీ కి వివరించారు. గతంలో నిర్ణయించిన విధంగా బి సి విద్యార్థులకు ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ను ఉస్మానియా యూనివర్శీటి లోని ప్రో. రాంరెడ్డి దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేసామని కమిటీ కి తెలిపారు. సివిల్ సర్వీసెస్ కోచింగ్ కు 543 మంది విద్యార్ధులు అడ్మిషన్లు తీసుకోని క్లాసులకు హాజరు అవుతున్నారని, వారికి స్కాలర్ షిప్ తో పాటు బుక్ ఫండ్ ను టేస్టులో 50 శాతం పైగా మార్కులు సాధించిన వారికి ఇస్తున్నట్లు తెలిపారు.
బి సి స్టడీ సెంటర్ల లో R R B , VRO , S I / Constables , పంచాయితీ కార్యదర్శుల ఉద్యోగాల కోసం 3317 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా 549 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని బి సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కు స్టడీ సెంటర్ అధికారులు వివరించారు. అన్ని బి సి స్టడీ సెంటర్ల లో జాబు మేళాలు నిర్వహించామని , ఈ మేళాకు రెండు వేల కు పైగా నిరుద్యోగ యువత హాజరయ్యారని వారిలో 500 మంది కి పైగా శిక్షణ కోసం పంపామని అధికారులు వెల్లడించారు.వీటితో పాటు 319 మంది నిరుద్యోగులకు బ్యూటిషియన్ , సి సి టి వి ల అపరేటింగ్ , కంఫ్యూటర్ కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉపాది ని కల్పించామని బి సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కు వివరించారు. సంవత్సరానికి 4 నెలల ఫౌండేషన్ కోర్సు నిరుద్యోగ యువత కోసం 3 బ్యాచ్ ల కింద శిక్షణ ఇవ్వాలని బి సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం అధికారులకు ఈ సమీక్షా సమావేశంలో అధికారులను అదేశించారు. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ , ఆర్ ఆర్ బి , బ్యాంక్ ఉద్యోగాలకు కూడా ఫౌండేషన్ కోర్సును అందించాలని బుర్ర వెంకటేశం అధికారులకు సూచించారు. నూతనంగా రాష్ట్రంలో ఐదు బి సి సర్కిళ్ళ నిర్మాణం కోసం ప్రతిపాదించగా ఇప్పటికే సంగారెడ్డి , అదిలాబాద్ లో పూర్తియ్యాయన్నారు. ఖమ్మం , కరీంనగర్ లలో నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు బుర్ర వెంకటేశం. ఎం ఎల్ ఎ , ఎం పి నియేజకవర్గ అభివృద్ది నిధులను యువత ఉపాధి, కోచింగ్ ల కోసం కేటాయించే విధంగా ప్రతిపాదనలను తయారు చేయ్యాలని బి సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం స్టడీ సర్కిల్ అదికారులను అదేశించారు. బి సి స్టడీ సెంటర్ల లలో మెరుగైన ఫలితాలు సాధించటానికి సిబ్బంది మరింత కష్టపడాలని అధికారులను కోరారు.