గోరంట్ల మాధవ్… నామినేషన్ కు తొలగిన అడ్డంకి…ఏపీ ప్రభుత్వానికి ట్రిబ్యునల్ ఆదేశాలు..
గోరంట్ల మాధవ్… నామినేషన్ కు తొలగిన అడ్డంకి…
ఏపీ ప్రభుత్వానికి ట్రిబ్యునల్ ఆదేశాలు..
– హిందూపురం లోక్ సభ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ రెండు నెలల క్రితం వీఆర్ఎస్ ఇచ్చినా ప్రభుత్వం ఆమోదించకుండా పక్కన పెట్టింది. దాంతో ఆయన నామినేషన్ పై కొంత గందరగోళం ఏర్పడింది. అయితే ఈరోజు ట్రిబ్యునల్ తక్షణం మాధవ్ వీఆర్ఎస్ ను ఆమోదించాలని ఆదేశించింది.
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల పై చేసిన వ్యాఖ్యల పై జిల్లా పోలీసు అధికారుల సంఘం తరఫున స్పందిస్తూ… పోలీసు అధికారుల పై నోరు పారేసుకొంటే… నాలుక కోస్తా నంటూ… గోరంట్ల మాధవ్ జేసీకి సవాల్ విసిరి అనూహ్యంగా వార్తల్లో నిలిచారు… కదిరి సీఐ గా పనిచేసిన ఈ ఆఫీసర్ డేరింగ్ కు ముచ్చట పడి మరీ హిందూపురం లోక్సభ టికెట్టునిచ్చాడు జగన్