పులివెందుల సి.ఐ సస్పెన్షన్… వై. ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు…
పులివెందుల సి.ఐ సస్పెన్షన్
వై.సీ. పి.నాయకులు వై. ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వేటు
జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐ. పి.ఎస్
కడప మార్చి21. పులివెందుల అప్గ్రేడ్ పి.ఎస్ సి.ఐ శంకరయ్య ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఒక ప్రకటన లో తెలిపారు. వై. సి. పి.నాయకులు వై.యెస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇన్స్పెక్టర్ శంకరయ్య తన సమక్షంలో వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరులు నేర స్థలంలోని సాక్ష్యాలను మార్పు చేస్తుండగా మరియు శవాన్ని శవ పంచనామా కాకుండా పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా సి. ఐ గారు ఎటువంటి చర్యలు తీసుకోనందున, విధుల్లో నిర్లక్ష్యం వహించడం వలన సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.