మోహన్ బాబు హౌస్ అరెస్ట్…


తిరుపతి లో… సినీనటుడు మోహన్ బాబు ఇంటిని చుట్టి ముట్టిన పోలీసులు…
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు స్కాలర్‌షిప్ బకాయిల పై గతంలో చంద్రబాబు ప్రభుత్వం పై బహిరంగ విమర్శలు చేసిన ప్రముఖ సినీనటుడు, విద్యానికేతన్ సంస్థల ఛైర్మన్ మోహన్‌బాబు… ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు.. తన సంస్థ లోని విద్యార్థులతో కలిసి స్కాలర్‌షిప్ సమస్యలపై నేడు ర్యాలీ నిర్వహించి, తమ నిరసనను తెలుయ చేయాలని నిర్ణయించాతరు మోహన్ బాబు…
అయితే… ఎన్నికల వేళ ర్యాలీలు, బహిరంగ నిరసనలకు అనుమతులు ఇవ్వలేమన్న పోలీసులు, ముందు జాగ్రత్తగా మోహన్ బాబుతో పాటు విద్యాసంస్థకు చెందిన మరికొంత మంది కీలక సభ్యులను గృహ నిర్భందం చేసారు…

తనను హౌస్ అరెస్ట్ చేయడంపై స్పందించిన మోహన్ బాబు… ఎట్టిపరిస్థితిలోను నిరసన ర్యాలీని కొనసగిస్తానంటూ ప్రకటించారు…

అసలే ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుతున్న వేళ… ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి అవకాశాల కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్న రాజకీయ పక్షాలు ఈ పరిస్థితి పై ఎలా స్పందిస్తారో చూడాలి…

వైఎస్ కుటుంబంతో ఉన్న బంధుత్వం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు..

About The Author