గోదావరి జిల్లాలను హేళన చేస్తున్న వారికి ప్రత్యేకం….


సిటీల నుంచి వచ్చి గోదావరి జిల్లాలను హేళన చేస్తున్న వారికి ప్రత్యేకం….
చూసారాండే ఎంత అద్భుతంగా ఉందో… గోదారి జిల్లాల్లో ఊరిఊరికీ, ఈదిఈదికి ఇలాంటి సీన్లు సేనా కనిపిత్తాయండి. చక్కగా చీర కట్టుకుని నుదుటిన ఇంత బొట్టు ఎట్టుకుని ఇంటి ముందర కళ్ళాపు చల్లి ముగ్గేసి, మొగుడికి అనువుగా ఉంటా కుటుంబాన్ని సక్కబెట్టుకునే ఆడోళ్ళు తప్ప సమాన హక్కులూ, హైక్లాస్ బతుకులూ అంటా మేకప్పులేసీ మేచింగులేసీ అరాకొరా డ్రెస్సులేసీ అడావిడి చేసేవోళ్ళు ఇక్కడ కనిపించరండి. అసలు పేడతో అలికిన పూరి పాకల్లో ఉన్నా కూడా మేమున్నంత సుఖంగా.. సంతృప్తిగా మీ సిటీల్లో కోట్లు ఖర్చెట్టి కట్టుకున్న పాలరాతి బంగ్లాల్లో, అపార్ట్ మెంట్లలో మీరుండగలరేంటండే…, భలేటొరే…! మొగుడిదో దారి, పెళ్ళానిదో దారి, బిడ్డలది తలోదారి..! ఆమాటికొత్తే మీరు తిన్నారో ఉన్నారో పట్టించుకునే దిక్కూ లేదు, ఆప్యాయంగా పలకరించుకునే లక్కూ లేదు. కానీ మా పల్లెటూళ్ళలో అలాకాదండి ఎవరికి కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఊరంతా పంచుకుంటాది. ఆఖరికి ఊరులో చీమ చిటుక్కుమన్నా కూడా ఊరంతా పోగవ్వుద్ది. ఇక్కడ మనిషికి మనిషే సాయం కానీ మెషీన్లు కాదండి. మాకు ఇలా బంధాలు అనుబంధాలు, అనురాగాలూ ఆప్యాయతలు పెంచుకోవడమే తెలుసు తప్ప లెక్కలు కట్టి బ్యాంకు బ్యాలెన్స్ లు పెంచుకోడం తెలవదండి. అలాగని మాకేదో డబ్బు లేదనుకోకండి మాకున్న స్ధలాలు పొలాలూ బంగారాలూ సూత్తే మీకు కళ్ళు తిరుగుతాయండి. ఒక్క సంక్రాంతి టైం లోనే కోట్లకి కోట్లు జల్సాలకీ, పందేలకీ ఖర్చెట్టేత్తాం కదండే బాబా..! అసలు పెపంచకం మొత్తానికి గోదారి జిల్లలంత అందమైన జిల్లాలు ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండులో కూడా లేవని మా ఊరి సోషల్ మేట్టారు అనీవోడండి. అందుకేకదండి మరి సినిమావోళ్ళు కూడా షూటింగులంటే గోదారి జిల్లాలకి పరిగెడతారు. మా గోదారి జిల్లాల్లో మమకారాలతో పాటు ఎటకారాలూ, సరదాలతో పాటు సరసాలూ కూడా బెమ్మాండంగా ఉంటాయండి. మాకు అనురాగాలూ ఆప్యాయతలే కాదు పంతాలూ పౌరుషాలు కూడా ఎక్కువేనండి, పరువుకోసం పేనాలైనా ఇచ్చేత్తారు తప్ప ఒకడి ముందు తలవంచరండి. ఇంక మర్యాదల విషయానికొత్తే సెప్పేదేముంది దానికి మాకు మేమే సాటి. సిటీల్లో చుట్టం వత్తే టీ ఇవ్వడానికి కూడా ఏడిసే ఎదవలున్న ఈ పెపంచకంలో.. మేం చుట్టం వత్తే పంచభక్ష్య పరమన్నాలతో, కడుపు నిండా తిండి పెట్టి సంతోషంగా పంపిత్తామండి , ఆయ్.. ఎవరైనా కొట్టి సంపేత్తారు మేము పెట్టి సంపేత్తాం కదండి మరి. ఇంక ఎందుకో తెలవదు కానీ మొన్నటిదాకా ఇక్కడే ఏడిచి , మన స్కూల్లో చదువుకుని, అణాకానీ జీతాలతో చానాళ్ల బట్టీ సిటీలో సెటిలైన పతీనాకొడుకూ పండక్కి ఊరొచ్చి మన భాషని ఇమర్సిత్తం పెద్ద పేషన్ గా ఫీలైపోతున్నాడండి. ఓరి ఎదవల్లారా… ఏండే అని అంటున్నామంటే ఎదటోడికి గౌరవం ఇవాలనే కానీ మాకు ‘ఏరా’ అని పిలవడం రాక కాదు. నోరు ఇప్పితే అమ్మనాబూతులు మాటాడగలం. కానీ పెద్దలు నేర్పిన సంస్కారం అడ్డొచ్చి ఆ పని చెయ్యం. చివరిగా ఒక్కమాట…. పండగలకే కాదు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మా ఊళ్ళకి రండి , ఉండాలనుకున్నన్ని రోజులు ఉండండి. సిగ్గు పడకుండా కావాల్సింది అడిగి తినండి, మర్యాద నిలబెట్టుకుని ఎల్లండి. అంతేకాని ఇక్కడికొచ్చి మా గోదావరి జిల్లాలను కానీ, ప్రజలను కానీ, పద్దతుల్ని కానీ, భాషని కానీ హేళన సెయ్యలని సూడకండి. మేం మీకంటే ముదర్లం. మీగురించి మీజీవితాల గురించీ మేం మాటాడటం మొదలెడితే మీరు జన్మజన్మలకీ మర్చిపోలేరు

About The Author