సామాన్య రైతు సమస్యను చూసి చలించిన ముఖ్యమంత్రి…
https://m.facebook.com/story.php?story_fbid=2398922090342570&id=1447651982136257
ఒక రైతే పాలకుడైతే ఇలాగే ఉంటుంది..
సామాన్య రైతు సమస్యను చూసి చలించిన ముఖ్యమంత్రి…
నేరుగా రైతుకే ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని రైతు ఇంటికి కలెక్టర్ ను పంపి సమస్య పరిష్కారానికి బాటలు వేసి కొత్త ట్రెండ్ సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు…
స్వయంగా రైతు భిడ్డ,రైతుల పట్ల ముందు నుండి గొప్ప ఆలోచన,ఆచరణ కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణాలో రైతుబందు లాంటి కార్యక్రమాన్ని చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు.
నేడు ఒక సామన్య రైతు పట్ల ఆయన వ్యవహరించిన తీరు రైతుల పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమను తెలుపుతుంది.మంచిర్యాల జిల్లా నెల్లెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి శంకరయ్య అనే రైతు భూమి వేరే వ్యక్తి పేరుపై అక్కడి వీఆర్ వో ఎక్కించారని తమకు న్యాయం చేయాలని కొద్ది రోజులుగా అతని కుమారుడు శరత్ వీఆర్ వో చుట్టూ, ఆఫీసులకు తిరిగాడు..ఫలితం లేకపోవడంతో నేరుగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే శరత్ ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి ముఖ్యమంత్రిగారు తమకు న్యాయం చేయాలని కోరాడు. అది చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తక్షణమే శరత్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కలెక్టర్ కు ఆ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు..కలెక్టర్ నేరుగా శరత్ ఇంటికే వచ్చి వివరాలు సేకరించి సమస్యను పరిష్కరించే పని మొదలుపెట్టారు…అంతే కాకుండా శరత్ ప్రయత్నాన్ని అబినందించారు.
ఇలాంటి మనసున్న నాయకుడు ,రైతు బాందవుడు సమస్యలపై తక్షణమే స్పందించే గొప్ప ఆలోచనా పరుడు ముఖ్యమంత్రి అవడం తెలంగాణా చేసుకున్న అదృష్టం..కేసీఆర్ గారిని అర్దరహిత విమర్శలు చేసేవారు ముందు ఆయన వ్యక్తిత్వాన్ని అర్దం చేసుకోవాలి.. నాయకుడంటే జనం కోసం పనిచేసేవారని కేసీఆర్ గారు మరోసారి నిరూపించారు.దేశంలో ఇలాంటి నాయకుడు అవసరం.కేసీఆర్ గారు దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించి రైతుల జీవితాల్లో మార్పు తీసుకురాగలరనే నమ్మకం మాకుంది.