శారదా జ్గ్నానపుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి షష్టిపూర్తి మహోత్సవం…
శారదా జ్గ్నానపుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి షష్టిపూర్తి మహోత్సవం. వారు ఆ తల్లి దయతో మనందరికి అందిస్తున్న ఈ అమృతభాండం *మన సనాతన ధర్మం* గురించి, పురాణేతిహాసాలపై ప్రవచనం చేస్తు అనేక లక్షల మందిని మరల ఈ ధర్మం నుండీ వెళిపోకుండా కాపాడుతున్నారు అన్నది అక్షర సత్యం. తెలియని ధర్మ సూక్ష్మాలని అందిస్తూ జీవితాలని చక్కదిద్దుకొనే అవకాశం తెలియచేస్తున్నారు. ఎందరినో నిరాశ, నిస్ప్రహల నుండి, ఆత్మహత్యా దోషాలనుండీ రక్షించారు తమ ప్రవచనామృతం పోసి. ఆచరించినదే చెపుతూ వస్తున్నారు. నేడు తమ పదవీ విరమణ తరవాత ఓ గోశాలని తమ శ్రమదానం తో శిష్యులతో కలిపి కట్టుకుని, అక్కడే నివసిస్తు, ఆ గోశాలలో ప్రవచనధారని అందిస్తు, ఆదర్శం అన్నది అనుసరిస్తు, మనకి మార్గదర్శకులుగా నడుస్తు, నడిపిస్తున్నారు కోట్ల మందిని. వీరి దాంపత్యం నేటి తరాలకి ఆదర్శం అన్నది అతిశయోక్తి కానేకాదు. ఓ వ్యక్తి ఎలా బ్రతకాలో తెలియచేసిన రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆచరిస్తున్న పుణ్య దంపతులు. వీరి దంపతులకి శత పాదాభివందనం .