నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రసవించి…
ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుట్టిన ఘటనలు చాలానే ఉంటాయి. అయితే నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రసవించి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందో మహిళ. ఈ విచిత్రమైన సంఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి..
బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ ప్రాంతానికి చెందిన అరిఫా సుల్తానా ఐతీ ఫిబ్రవరి 25న నెలలు నిండని ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించగా.. సాధారణ ప్రసవం అయ్యింది. తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉండటంతో వైద్యులు వారిని ఇంటికి పంపించారు. అయితే ఇటీవల మార్చి 22న అరిఫాకు మరోసారి నొప్పులు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి.. ఆమె గర్భంలో మరో ఇద్దరు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేశారు. అంటే సరిగ్గా 26 రోజుల తర్వాత అరిఫా మరో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు.
అరిఫాకు రెండు గర్భాశయాలు ఉన్నాయి. తొలి కాన్పు సమయంలో ఈ విషయాన్ని వైద్యులు గుర్తించకపోవడం వల్ల ఆమెకు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు ప్రసవం అయ్యింది. ‘మహిళకు రెండు గర్భాశయాలు ఉండటం అత్యంత అరుదు.