వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్…

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం హెలికాఫ్టర్‌లో సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు వాయనాడ్ చేరుకున్న ఆయన.. కాల్పెట్ట కలెక్టరేట్ కార్యాలయంలో పత్రాలు సమర్పించారు. అనంతరం భారీ రోడ్ షో నిర్వహించారు. రాహుల్, ప్రియాంకలకు కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. రోడ్ షోకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాహుల్ అమేఠీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్టు గత వారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దక్షిణాదిన కాంగ్రెస్‌ బలం పెంచేందుకే రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వయనాడ్‌లో కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత ఎంఐ షానావాస్‌ ఇక్కడ విజయం సాధించారు.

About The Author