సూర్యాపేట లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ముస్లిం సోదరుల ఆత్మీయ సభ…


సూర్యాపేట లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ముస్లిం సోదరుల ఆత్మీయ సభ ముఖ్య అతిథులుగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.

ఈసందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ కామెంట్స్

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే మైనార్టీలకు గౌరవం పెరిగింది. యావత్ భారతదేశం లో మైనార్టీలకు 4,700 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో 2,400 కోట్ల బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కేటాయించారు. 2004 లో అప్పటి కాంగ్రెస్ పాలకులు ముస్లింల సంక్షేమానికి కేటాయించింది కేవలం 80 లక్షలే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ముస్లిం మైనార్టీల స్థితిగతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సర్వే చేయిం చారు. 30 ఏండ్లు నిండినా ముస్లిం మైనార్టీల పిల్లల కు పెండ్లిల్లు కావడం లేదన్నది గుర్తించి షాధి ముబారక్ పథకాన్ని రూపొందించారని తెలంగాణ ఏర్పడితే హిందు, ముస్లిం ఘర్షణలు ఉంటాయని ,నక్సల్స్ సమస్య తలెత్తుతుందని,కరెంట్ ఉండనే ఉండదన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంచనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పటాపంచలు చేశారన్నారు. అటువంటి వాతావరణం లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మతసామ రస్యం ఫరిడ విల్లుతున్నది. శాంతి భద్రతల విషయం లో యావత్ భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సెక్యులర్ పార్టీ కాదు. మాటలు చెప్పి గొడవలు పెట్టి పబ్బం గడుపుకున్న చరిత్ర కాంగ్రెస్ ది
మౌలానాలకు గౌరవం పెరుగిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చలువే అని మైనార్టీల సంక్షేమం గురించి ఆలోచిం చేది ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన మీదటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగానే మైనార్టీల రిజర్వేషన్లు 12 శాతానికి పెంచి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. కేంద్రంలో మనం చెప్పి న ప్రధాని ఉన్నప్పుడే 12 శాతం రిజర్వేషన్లు సాధించుకో గలుగుతాం అన్నారు. టి ఆర్ యస్ పార్టీ 12 శాతం రిజర్వే షన్లు అన్న రోజున ప్రతి పక్షాలు అవహేళన గా మాట్లా డాయన్నారు. కొత్త రాష్ట్రంలో మైనారిటీ లకు ఉప ముఖ్య మంత్రి పదవి నివ్వడంతో తెలంగాణ సమాజంలో ముస్లిం లకు గౌరవం పెరిగిందన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో ముస్లింలు తిరగలేని పరిస్థితి ఏర్పడిందని. కశ్మీర్ ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడిని కోరుకుంటున్నారన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి గారి కామెంట్స్…

దేశంలో మత కల్లోలాలకు కారణం కాంగ్రెస్ పార్టీయే అధికా ర మార్పిడి కోసం, కాంగ్రెస్ ఎంతటి నీచానికైనా దిగజారు తుంది. ముస్లిం మైనార్టీ సోదరులను ఓటు బ్యాంకు గానే చూసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ లో మాత్రమే సీఎం కేసీఆర్ అన్ని మతాలను, సమాన దృష్టితో చూసి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వమే రంజాన్ పండుగను నిర్వహించి గొప్ప గౌరవాన్ని ఇచ్చారు సీఎం కేసీఆర్. గంగా జమున తహిజీబ్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో మాత్ర మే ఉందని గుర్తించేలా సీఎం కేసీఆర్ అన్ని మతాలను ఆదరిస్తున్నారు.పెద్ద పీట వేస్తున్నారు దేశానికి ఆదర్శంగా నిలిచారు. దేశానికి సేవ చేసే భాగ్యం కేసీఆర్ కు కల్పించే అవకాశాన్ని ఈ ఎన్నికల ద్వారా తెలంగాణా ప్రజలు ఇవ్వాలి.ఓట్లు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. 16 ఎంపీ స్థానాలను ఏకపక్షంగా టీఆర్ఎస్ కి అందించాలి.

About The Author