కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని రొట్టెలు చేసుకుంటున్నది ఎవరు??


ఒక ధోతీ కట్టుకుని బనియన్ వేసుకుని కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని రొట్టెలు చేసుకుంటున్నది ఎవరు .
ఎవరో సామాన్యుడు అయుంటారు అనుకుంటున్నారా . అయన దేశాన్ని అభివృద్ధిపథములో నడిపించిన వాజపాయి గారి పాలనా కాలములో బొగ్గు శాఖా మంత్రిగా పని చేసారు. బొగ్గు శాఖ ఆఫీసులో పని చేసే ఆఫీసర్లే కోట్లకు పడగలెత్తే ఆఫీసు గూర్చి అందరికీ తెలుసు కదా?

కాంగ్రెస్ ప్రధానమంత్రికి సైతం మసి పూసిన ఆఫీస్ అది. అంతేనంటారా బొగ్గు శాఖా ఫైళ్లను సైతం మాయం చేసిన ఘనులున్న ఆఫీస్ లో మచ్చలేని మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనది. నాలుగు సార్లు ఎం పీ గా ఎన్నిక అయిన ఆయన తప్పకుండా పార్లమెంటుకు తప్పక హాజరయ్యే వారిలో ఆయన ముందు ఉంటారు.

క్రిమినల్ కేసులున్నాయా లేవు, ఆయన ఆదాయ ఆస్తుల వివరాలు మై నేత అనే సైట్ లో చూడండి.. ఒక ఏం పీ అయుండీ కేంద్ర మంత్రిగా పని చేసి కూడా ఎంత కూడపెట్టుకుంటున్నారో.. వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నాడని తెలిస్తే అవినీతిపరులను వెనకేసుకువస్తున్న వారందరూ సిగ్గుతో చస్తారు..

ఆయన భారతీయ జనతా పార్టీ వాజపాయి గారి హయాములో బొగ్గు శాఖా మంత్రి, ఆయన అత్యంత శాతం పార్లమెంటుకు హాజరయిన వారు దాదాపు 98 శాతం , ఈ ఐదేళ్లలో ఆయన 136 డిబేట్స్ చేసారు పార్లెమెంటులో ప్రజలకోసం. ప్రశ్నోత్తర సమయాలలో 339 ప్రశ్నలు అడిగారు. ఆరు ప్రైవేట్ బిల్స్ ప్రవేశపెట్టారు.

ఇలాంటి నాయకులు కదా ప్రజా సంక్షేమం కోసం పాటుపడేది ? ఆయనే భారతీయ జనతా పార్టీ నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి నాలుగు సార్లు ఎన్నిక అయిన.. ఎం పీ ప్రహ్లాద్ సింగ్ పటేల్…

About The Author