భూతద్దం’లో చూసి కూడా ఓటు వేయొచ్చు.. ఎన్నికల సంఘం కొత్త సదుపాయం…
పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లలో ఎవరికైనా దృష్టి దోషం ఉండి అభ్యర్థి గుర్తును గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మరింత స్పష్టంగా చూసేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఈసారి పోలింగ్ కేంద్రాల్లో ‘భూతద్దం’ అందుబాటులో ఉంచుతోంది. సిరా, పోలింగ్ చీటీలు, తదితర పోలింగ్ సామగ్రితోపాటు భూతద్దం కూడా ఉంటుందని, అవసరమైన వారు వినియోగించుకోవచ్చునని సూచించింది,*
*వయసుతోపాటు వచ్చే దృష్టిలోపం వల్ల కొందరు వృద్ధులు ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. గుర్తును సరిగ్గా గుర్తించలేకుంటే వేరే వారికి ఓటువేసే ప్రమాదం ఉంది. ఈ సమస్యను గుర్తించి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక భూతద్దం అందుబాటులో ఉంచుతున్నామని, అవసరమైన వారు ప్రిసైడింగ్ అధికారిని అడిగి తీసుకోవచ్చని సూచించింది. ఈ అద్దాన్ని ఉపయోగించి గుర్తులను పెద్దవిగా చూడవచ్చునని, తాము వేయాల్సిన గుర్తును గుర్తించవచ్చని తెలిపింది. అంధుల కోసం కూడా ఈసారి ఎన్నిక సంఘం ప్రత్యేక సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే*.