ఇండియాలో మోడీనే గెలవాలన్న ఇమ్రాన్ ఖాన్…
అందుకు ప్రత్యేక కారణం ఏమిటి? అంటే… ఒకవేళ మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయితే కశ్మీర్ ఇష్యూ మీద సెటిల్ మెంట్ జరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అదే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని పార్టీలు అధికారంలోకి వస్తే.. కశ్మీర్ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుందని ఏ నిర్ణయం తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ వాళ్లు ధైర్యం చేయరు.. అని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం.. రైట్ వింగ్ కు భయపడుతుందని అభిప్రాయపడ్డారు. అంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే.. కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉన్నా కశ్మీర్ వంటి కీలకమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోలేదని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు.
అదే మోడీ అయితే.. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఇండియాలో ముస్లింలు గతం నుంచి సురక్షితంగానే ఫీలయ్యే వారని అయితే హిందూ అతివాదం వల్ల ఇండియాలోని ముస్లింలలో కొంత భయం నెలకొని ఉందని మాత్రం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
మొత్తానికి మళ్లీ మోడీనే భారత్ కు ప్రధాని కావాలని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడం విశేషమే. నాయకుడిగా ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోలగలరని మోడీకి ఇమ్రాన్ ఖాన్ కితాబిచ్చినట్టే!
ప్రస్థుతం భారత్ లో జరుగుతున్న ఎన్నికలలో..BJP గెలిస్తే శాంతి చర్చలకు అవకాశం ఉంటుందని..ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ గెలిస్తే..శాంతి చర్చలు నిర్వహించడానికి భయపడుతుందని..కశ్మీర్ అంశంపై శాంతి చర్చలు జరగాలంటే మళ్లీ నరేంద్రమోదీనే ప్రధాని కావాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలిస్తే కశ్మీర్ అంశం కొలిక్కి వస్తుందని ఆయన అన్నారని ఓ జాతీయ చానెల్ పేర్కొంది.
ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న పరిణామాలను తానెప్పుడు ఊహించలేదని.. తనకు భారత్‌లోని చాలా మంది ముస్లింలు తెలుసని, వారు ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారని, కానీ ప్రస్తుతం వారు హిందుత్వ జాతీయవాదంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు.
కశ్మీర్ ఓ రాజకీయ అంశమని.. దానికి మిలిటరీ పరిష్కారం లేదన్నారు. పాక్ మిలిటెంట్లు దాడి చేసినప్పుడుల్లా కశ్మీరీలు నష్టపోయారని, తోటివారితో శాంతి సంబంధాలు కలిగి ఉండడం పాక్‌కు అవసరమన్నారు. ఇప్పటికే పాక్‌లోని ఉగ్రవాదులను పాక్ సైన్యం ఏరివేసిందని, ఈ విషయంలో ప్రభుత్వం వారికి పూర్తి మద్దతిస్తుందన్నారు. మోదీపై వ్యతిరేకత వ్యక్తమైతే.. భారత సైన్యం చేత పాక్‌పై దాడి చేయించే అవకాశం ఉందన్నారు.