10th స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.

10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు తీపికబురు అందించింది ప్రభుత్వం.

మ్యాథ్స్ సబ్జెక్టులో నాలుగు ప్రశ్నలు తప్పుగా ప్రింట్ అయ్యాయి. దీనిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో విద్యాశాఖ స్పందించింది. తప్పుగా వచ్చిన ప్రశ్నలకు 6 మార్కులు కలపాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రశ్నలను వ్రాయడానికి ప్రయత్నం చేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది

పేపర్ -1లో ఐదున్నర మార్కులు, పేపర్ – 2లో అర మార్కు కలుపుతామని విద్యాశాఖ వెల్లడించింది.
పేపర్ -1 లోని పార్ట్ ఏ లో 6వ ప్రశ్నకు ఒక మార్కు..16వ ప్రశ్నకు 4 మార్కులు..పార్ట్ – బిలోని 7వ ప్రశ్నకు అర మార్కుతో పాటు పేపర్ – బిలోని 4వ ప్రశ్నకు అర మార్కు కలుపనున్నారు.

పదో తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే…

About The Author