జడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల…

జడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల…

కౌంటింగ్ మే 27

రాష్ట్రంలో మరో ఎన్నికల పోరు నగాట్రా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కానుంది. వచ్చే నెల 14వ తేదీ లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఈ ఓట్ల లెక్కింపు మే 27న చేపడతారు.

మొదటి విడత ఎన్నికలు మే 6వ తేదీన, రెండవ విడత ఎన్నికలు మే 10వ తేదీన, మూడవ విడత ఎన్నికలు మే 14వ తేదీన జరుగుతాయి.

మొదటి విడత ఎన్నికలకు
ఏప్రిల్ 22వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 24వ తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 28వ తేదీ. పోలింగ్ మే 6వ తేదీన జరగనుంది.

రెండవ విడత ఎన్నికలకు
ఏప్రిల్ 26వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 28వ తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 2వ తేదీ. పోలింగ్ మే10వ తేదీన జరగనుంది.

మూడవ విడత ఎన్నికలకు
ఏప్రిల్ 30వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 2వ తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 6వ తేదీ. పోలింగ్ మే 14వ తేదీన జరగనుంది.

About The Author