ఇంటర్ బోర్డు నిర్వాకం…21వేల మంది విద్యార్థుల వివరాలు గల్లంతు…
వేలాది మెవెూల్లో తప్పులు
పరీక్షకు గైర్హాజరంటూనే పాస్ మెవెూ
అలా ఫస్టియర్‌లో 214,
సెకండియర్‌లో 318 మెవెూలు జారీ
అధికారుల తీరుపై విద్యార్థుల మండిపాటు
ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో తప్పిదాలు పుట్ట పగిలితే చీమలు బయటికొస్తు న్నట్టుగా వస్తున్నాయి. ఫలితాల మాయాజాలం ఎలా ఉం దంటే పరీక్షకు హాజరు కాలేదని పేర్కొంటూనే ఉత్తీర్ణ సాధిం చినట్టు మెమో జారీ చేశారు. జాగ్రఫీలో ప్రాక్టికల్ మార్కులు మాయమైనప్పటికీ పాసయినట్టు మెమో ఇచ్చారు. మొదటి సంవత్సరంలో కాలేజీ టాపర్లుగా ఉన్నవారు ద్వితీయ సం వత్సరంలో రెండంకెల మార్కులను కూడా సాధించలేక పోయినట్టు ఫలితాల్లో ప్రకటించారు.
ఇంటర్ ఫలితాల్లో వివ రాలు తెలియని వారు సుమారు 21 వేల మంది విద్యార్థు లున్నట్టు తెలుస్తోంది. వీరికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో దొరకడం లేదు.
900 నుంచి 929కిపైగా* *మార్కులు వచ్చిన 11 మంది విద్యార్థులు ఫెయిలయినట్టు మెమోలు జారీ అయ్యాయి. వారిలో కొందరు మొదటి సంవత్సరంలో కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో టాపర్లుగా నిలిచినవారుగా తెలుస్తోంది. వారు ఫెయిలైనట్టుగా మెమోలు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. జాగ్రఫీలో ప్రాక్టికల్ మార్కులు కనిపిం చడం లేదు. కానీ మెమో మాత్రం పాసయినట్టు వచ్చింది. కొంతమందికి జారీ అయిన మెమోల్లో మార్కులు తప్పు లుగా అచ్చు అయిఉండొచ్చని బోర్డు అధికారులు చెబుతు న్నారు. ఉదాహరణకు 95 మార్కులు వస్తే వారికి 9 తొలగించి కేవలం 5 మాత్రమే అచ్చియినట్టు.. అలాగే 75 మార్కులు వస్తే 7 అచ్చుకాకుండా కేవలం 5 మాత్రమే అచ్చయి ఉండే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇటువంటివి కూ డా మెమోల్లో కనిపించాయి.
అలాగే పరీక్షకు అబ్సెంట్ అయి నట్టుగా ప్రకటించారు కానీ వారు పాసయినట్టు మెమోలో ఫలితాలను ఇచ్చారు. ఇలాంటి వారు మొదటి సంవత్స రంలో 214 మంది ఉండగా ద్వితీయ సంవత్సరం వారు 318 ఉన్నట్టు తెలిసింది.
సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి:
ఇంటర్ ఫలితాలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించా లని గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థకు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల నుంచి ఫలితాల వరకు అప్పగించిన సందర్భంలో అడ్మిషన్ల ప్రక్రియను సరి గా నిర్వర్తించలేకపోయిన సందర్భంలోనే సీజీజీ వారితో చేయించారని గుర్తు చేశారు. అందుకే సమగ్ర న్యాయ విచా రణ జరిపిస్తే పూర్తి వివరాలు బయటికొస్తాయని అన్నారు.