టిటిడి ఇఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రెస్ మీట్…
టిటిడి ఇఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రెస్ మీట్
1381కిలోల బంగారం తరలింపు వివాదం పై వివరణ ఇచ్చిన టిటిడి ఇఓ…
బంగారు ద్రవ్యనిధి పథకం కింద పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1311కిలోల బంగారాన్ని 1.75శాతం వడ్డీరేటుపై డిపాజిట్ చేశాం..
మూడేళ్ళ కాలపరిమితి 18వతేదీకి ముగిసింది…
మరో 70 కిలోలను స్విటర్జాండ్ లో కొనుగోలు చేసి 1311కిలోల బంగారంతో కలిపి చెన్నై నుంచి తిరుపతికి తీసుకువస్తున్నారు….
తమిళనాడులో ఈనెల 19వ తేదీన 1381కిలోల టిటిడి బంగారాన్ని సీజ్ చేశారు….
రసీదులు తీసుకెళ్ళి బంగారాన్ని ఖజానాకు తీసుకువచ్చాం….
బంగారం డిపాజిట్ చేసిన తరువాత టి.టి.డికి అప్పగించే వరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు బాధ్యత తీసుకోవాలి….
బంగారు సీజ్ కు పంజాబ్ బ్యాంకు అధికారులే బాధ్యత వహించాలి….
బంగారంపై ఇన్ కంటాక్స్ అధికారులు టిటిడికి నోటీసులు ఇచ్చారు….
వెంటనే చెన్నై వెళ్ళి తమిళనాడు పోలీసులకు, ఎన్నికల అధికారులకు బంగారం వివరాలను తెలియజేశాం….
20వ తేదీ టిటిడి ఖజానాకు 1381 కిలోల బంగారాన్ని అందజేశారు….
మొత్తం 9,259కిలోల బంగారం టిటిడి దగ్గర ఉంది..