రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి…

 

మంగళగిరి:- శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుధాకర్‌ గాయపడ్డాడు. సుధాకర్‌ తాజాగా ‘నువ్వు తోపురా’ చిత్రంలో నటించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న నటుడు సుధాకర్‌ గాయపడ్డారు.

About The Author