నేడు ప్రపంచ నాట్య దినోత్సవం…
ప్రపంచ నృత్య దినోత్సవం జరుపుకొనాలనే సూచనను
ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ ఇచ్చింది.1760 లో ప్రచుచింబడిన
ప్రముఖ రచన Lettres sur la daబnse అనే రచన దాని రచయిత
మరియు ఆధునిక నృత్యనాటికల సృష్టి కర్త అయిన జీన్-నోవెర్రీ
(1727-1810) యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని
ఈ దినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు..!!
.
ప్రతి సంవత్సరం, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడు
ప్రపంచవ్యాప్తంగా పేరున్నవారు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి ఆహ్వానిస్తారు.
.
ఈ దినం యొక్క లక్ష్యం నృత్య కళారూపం యొక్క ప్రపంచీకరణను చేధించడానికి,
అన్ని రాజకీయ, సాంస్కృతిక మరియు జాతి అడ్డంకులు అధిగమించడానికి మరియు
సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి
చేయుట ప్రపంచ నృత్య కూటమి, మరియు దాని నృత్య కమిటీ ఈ దినాన్ని
పారిస్ లోని UNESCO లోనూ మరియు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.
.
నాట్యానికి నృత్యానికి సంబంధించిన వరకు..
మనదేశం ఆది గురువు అని ఘనంగా గర్వంగా చెప్పవచ్చు..!!
మన దేశంలో ఉన్న కొన్ని ప్రముఖ నాట్యాలని చూద్దాం..!!
.
భరతనాట్యం
————
భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన
భరతమువి పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం.
దక్షిణ భారతదేశం లోని పురాతవ దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య
భంగిమలలో అప్సరలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి.
పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు.
ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని “తంజావూరు”లో
‘నట్టువన్నులు’ మరియు దేవదాసీలు ఈ కళకు పోషకులు.
ఈ రోజున భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యం
ఎక్కువ ప్రాధాన్యతనూ ప్రాముఖ్యతనూ సంతరించుకుంది.
.
పుట్టుక విషయానికి వస్తే, భరతనాట్యాన్ని రచించింది భరతముని కాగా,
ప్రస్తుతం వాడుకలో ఉన్న భరతనాట్యశాస్త్రాన్ని ఒక తాటి పైకి తెచ్చి,
అమలు పరచిన వారు తంజఊర్ కి చెందిన పొన్నయ్య, చెన్నయ్య,
వడివేలు, శివానందం అనబడే నలుగురు అన్నదమ్ములయిన నట్టువన్నులు.
వీరు పధ్ధెనిమిదవ (18) శతాబ్దానికి చెందినవారు.
విద్వాన్ శ్రీ మీనాక్షీ సుందరం పిళ్ళై వీరి వారసులే. ఈ కళను దేవాలయం
బయటికి తెచ్చి, ఒక వినోదంగా కాకుండా, ఒక శాస్త్రంగా గుర్తింపు, గౌరవం తెచ్చి,
సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు శ్రీ రుక్మిణీదేవి అరుండలే.
ఈమె మద్రాసు దగ్గరి తిరువన్మయూర్ లో ”కళాక్షేత్ర” అనబడే గురుకుల స్థాయి పాఠశాల స్థాపించారు.
.
ఆంధ్ర నాట్యం
————–
ఆంధ్రనాట్యంచాలా ప్రాచీనమయిన నృత్య రీతి.
ఈ నృత్యం బౌద్ధ కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి.
ఇది గుడిలో దేవాంగనలు ఆడే నృత్యంగా మొదలయి
ఒక పూర్తి స్థాయి నృత్యశాస్త్రంగా వికసించింది.
ఆంధ్రనాట ఎంతో కాలం ప్రాచుర్యంలో ఉన్న ఈ నాట్యం
దేవాలయాలకే కాక ఉత్సవాలలో కూడా ప్రదర్శించబడేది.
3000 యేళ్ళ క్రితం ఈ నాట్యాన్ని సామాజిక, ఆర్థిక కారణాల వల్ల నిలిపివేశారు.
కానీ 50 యేళ్ళ క్రితం ఆంధ్రనాట్యమని నామకరణం చేసి కొందరు
ఔత్సాహికులు ఈ నాట్యాన్ని పునరుద్ధరించారు.
వీరిలో నటరాజ రామకృష్ణ ప్రముఖులు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ నాట్యాన్ని
పూర్తి స్థాయి నృత్య సాంప్రదాయంగా ప్రవేశపెట్టారు.
ఆంధ్రనాట్యం అని నామకరణ చేయక ముందు ఈ నృత్యాన్ని
వ్యవహారంలో కచేరీ, కేళిక దర్బారు, మేజువాణి పేర్లతో పిలిచేవారు.
నృత్యం, ఇంకా అభినయం, రెండూ ఈ ప్రాచీన నృత్యంలో కనిపిస్తాయి.
భరతనాట్యం, మోహినియాట్టం, ఒడిస్సీ మొదలగునవి నట్టువమేళం
సాంప్రదాయానికి చెందినవి. కథకళి, యక్షగానం నాట్యమేళానికి సంబంధించినవి.
కూచిపూడి కూడా కొంత వరకూ నాట్యమేళానికి సంబంధించినదిగానే కనిపిస్తుంది.
.
కూచిపూడి నృత్యము
———————
కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఒక భారతీయ నాట్యం.
ఇది కృష్ణా జిల్లాలో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించింది.
క్రీ పూ 2వ శతాబ్దంలో ఆంధ్ర చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళంకు సుమారు
450 కిలోమీటరుల దూరంలో బంగాళాఖాతము పై ఉన్న ఈ ప్రాంతములోని
ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ పేరు వచ్చింది.
ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది.
15 వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి, కూచిపూడి నాట్యంలో ఆడవారు
నాట్యం చేయడానికి అనుగుణంగా, కొన్ని మార్పులు చేసి, దానిని పరిపుష్టం గావించాడు.
అయన అనుచరులైన కొందరు కూచిపూడిలో స్థిరపడి ఈ నాట్యాన్ని
అభ్యసించటంతో ఆ ఊరి పేరే ఈ నాట్యానికి సిద్ధించింది.
వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, తాడేపల్లి పేరయ్య
వంటి కూచిపూడి నృత్య కళాకారులు దీనిని విస్తరించి, సంస్కరించారు.
.
మోహినియాట్టం
—————
మోహినియాట్టం కేరళ రాష్ట్రానికి చెందిన, కేవలం
మహిళచే ప్రదర్శించబడే పాక్షిక సాంప్రదాయ నృత్యరీతి.
మోహిని అంటే చూసే వారిని సమ్మోహితుల్ని చేయగల స్త్రీ.
ఆట్టం అంటే సున్నితమైన శరీర కదలికలతో చేసే నాట్య ప్రదర్శన.
మోహినియాట్టం అంటే జగన్మోహిని చేసే నృత్యం అని అర్థం.
ఈ నాట్యంలో శృంగార రసం పాలు ఎక్కువగా ఉంటుంది.
ఈ నాట్యం యొక్క ప్రాచీనతను గురించి పండితుల్లో విభిన్న అభిప్రాయాలున్నాయి.
.
కథక్
——-
రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే
ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది.
ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేసాడు.
ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రదర్శిస్తారు.
పూర్వకాలంలో కథకులు (కథను చెప్పే వాళ్ళు),పురాణాల నుంచీ
ఇతిహాసాల నుంచీ కథలను వల్లె వేయడం లేదా పాడటం చేసేవారు.
దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. కథక్ ప్రారంభానికి ఇదే మొదలు.
ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమిస్తుంది.
క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో
ఈ నృత్యానికి సంబంధించిన ప్రస్తావన ఉంది.
.
ఒడిస్సీ
———
ఒడిస్సీ భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి.
ఇది ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది.
క్రీ.పూ. రెండో శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో
ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది.
ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడింది.
మొదట్లో దీనిని పూరి లోని జగన్నాధస్వామి
ఆలయంలో ‘మహరిలు’అనే స్త్రీలు ప్రదర్శించేవారు.
ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా
ఉన్న మైలిక త్రిభంగ అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది.
.
ఇక నాట్యానికి సేవ చేసిన ఎందఱో మహా మహులకి
వారి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులకి పేరుపేరునా అభినందనలు