అధిరిపోయే నిర్ణయం తీసుకున్న భారత్…
ఈశాన్య రాస్ట్రాల సరిహద్దులలోకి తరచుగా చైనా చొచ్చుకు వస్తుండటంతో మోది ప్రభుత్వం అద్భుత నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది అస్సాం ను రెండు భాగాలుగా విభజిస్తుంది. మరొక పక్క అరుణాచలప్రదేశ్ ను ఆనుకుని చైనా బోర్డర్ ఉంది.
దీనితో ఆయా ప్రాంతాలలొ నేరుగా బలగాలను తరలించడానికి బ్రహ్మపుత్ర నది క్రింద నుండి సొరంగ మార్గం తవ్వాలని మోది ప్రభుత్వం నిర్ణయించింది. బ్రహ్మపుత్ర నది క్రింద ఏకంగా 30 మీటర్ల లోతులొ, 12 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మించనున్నారు. నదికి 30 మీటర్ల లోతులొ నిర్మించడం వలన ఈ వంతెనకు ఏటువంటి శత్రుదేశాల దాడుల భయం ఉండదు. కేవలం ఆర్మీ అవసరాల కోసం నిర్మించే ఈ సొరంగ మార్గాన్ని వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించనున్నారు (pic is RP only)
నది కింద సొరంగంతో చైనాకు చెక్..
భారత ఈశాన్య సరిహద్దుల్లో తరచు ఉల్లంఘనలకు పాల్పడుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు సొరంగాన్ని నిర్మించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.
అసోంను రెండుగా విడదీస్తున్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగం తవ్వాలని ఇప్పటికే నిపుణులు సూచించినట్టు తెలుస్తోంది.
దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్రం సంబంధిత అధికారులును ఆదేశించింది.
ఎక్కడ నిర్మించనున్నారు..
తేజ్‌పూర్ జిల్లాలో ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ నది వెడల్పు దాదాపు 12 కి.మీ. ఉంటుంది. నదీగర్భం కింద భారీ సొరంగాన్ని నిర్మిస్తారు.
అరుణాచల్ ప్రదేశ్ చైనాతో నరిహద్దు కలిగిన రాష్ట్రం. అయితే అత్యవసర పరిస్థితుల్లో అక్కడకు సాయుధదళాలు చేరుకునేందుకు బ్రహ్మపుత్ర నదిని దాటాల్సి ఉంటుంది.
బ్రహ్మపుత్రలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో రెండు వంతెనలు నిర్మించారు.
కానీ సొరంగ నిర్మాణం మరింతగా రక్షణగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిలటరీ కాన్వాయ్‌లకు సొరంగంలో భద్రత ఉంటుంది.
ప్రయోజనాలివే..
రుతుపవనాల సమయంలో బ్రహ్మపుత్ర నది ప్రవాహం భారీగా ఉంటుంది. అనేక చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
నది అనేక సార్లు తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తుంది.
అదే నదీ గర్భంలో30 మీటర్లు అంతకంటే కింద తవ్వితే ఎలాంటి ఆటంకాలు లేకుండా సైనిక దళాలను తరలించవచ్చని తెలుస్తోంది.
దోలా-సదియా, బోగీబీల్.. తదితర భారీ వంతెనలు ఉన్నప్పటికీ వాటిపై ఇతర వాహనాలు భారీ సంఖ్యలో తిరుగుతుంటాయి.
సొరంగం నిర్మిస్తే శత్రుదేశాల దాడుల భయం లేకుండా భద్రతాదళాలు చైనా సరిహద్దుల వరకు చేరుకునే అవకాశముంటుంది.
దీంతో అత్యవసరపరిస్థితుల్లో చైనాపై ఆధిక్యం ప్రదర్శించేందుకు అవకాశం కలుగుతుంది.