అమ్మ నాన్నలు శవాలై ఉండగా … మూడేళ్ల అక్క.. తమ్ముడికి తల్లిలా…
నెలల వయసున్న తమ్ముడిని మూడేళ్ల అక్క 25రోజులపాటు కాపాడుకున్న అద్భుత అరుదైన సన్నివేశం హృదయాలను కదిలించే దారుణం. తల్లిదండ్రులు పై అంతస్తులో శవాలై పడిఉండగా కింద అంతస్తులో నెలల వయసున్న తమ్ముడిని పోలీసులు వచ్చేవరకు 25రోజలు పాటు కాపాడింది. డేవిడ్ పర్సా అనే వ్యక్తి, తన భార్య కుయ్ కోను ఇంట్లోనే కాల్చి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ బిడ్డల్ని కింద వదిలేసి పై అంతస్తులోకి పోయి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ సమయంలో ఇంటి తలుపులు కూడా వేసి ఉండటంతో మూడేళ్ల పాప, 2నెలల మగబిడ్డ ఇంట్లో ఉన్నారు. తల్లితండ్రి చనిపోవడంతో మూడేళ్ల పాప 25రోజులపాటు 2 నెలల బిడ్డను ఇంట్లోనే ఉన్న పాలు, నీళ్లు ఇచ్చి కాపాడుకుంది. భవనం నుంచి దుర్వాసన వస్తుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి చలించిపోయారు. తల్లిదండ్రుల శవాలు ఇంట్లోనే ఉన్నా, దుర్గంధం వెదజల్లుతున్నా, 2నెలల తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకున్న మూడేళ్ల పాప ఉదంతం లాస్ ఏంజెల్స్ లో ఇప్పుడు పెద్ద సంచలనం. పోలీస్ లు ఇంట్లోకి ప్రవేశించేనాటికి బాగా నీరసించిపోయి ఉన్న మూడేళ్ల అమ్మాయి, 2 నెలల బిడ్డను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు చెప్పారు. వీరిద్దరి యోగక్షేమాలను అబ్జర్వేషన్ హోమ్ కి అప్పగించారు