గోధుమగడ్డి రసం ఉపయోగాలు – సంపూర్ణ వివరణ-1
గోదుమగడ్డి రసం అనునది వైద్యంలో చాలా ప్రముఖపాత్ర కలిగి ఉంది. చాలా మందికి దీనియొక్క ఉపయోగాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు . గత కొంతకాలంగా దీనిపైన కొంతపరిశోధన చేసి దీని ఉపయోగాలు తెలుసుకున్నాను. ఈ గోధుమగడ్డి రసం కేన్సర్ చికిత్సలో కూడా చాలా అద్బుతఫలితాలు ఇచ్చింది. ఇది జలుబు , దగ్గు లాంటి చిన్నచిన్న వ్యాధులనే కాక బ్లడ్ కేన్సర్ , కేన్సర్ వంటివాటిలో కూడా చక్కని ఫలితాలు ఇస్తుంది.
డాక్టర్ థామస్ అనే పరిశోధకుడు కూడా ఈ గడ్డిపైనా చాలా అద్భుతపరిశోధనలు చేశాడు . ఈ గడ్డిలో జీవమున్న ఖనిజాలు , విటమిన్లు , ఇతర పోషకాలు అనేకం ఉన్నాయి అని కనుగొనినాడు. ఒక ఆరోగ్యవంతుడి రక్తములో ఉండే అన్ని రకాల పదార్ధాలు ఈ గోధుమగడ్డి రసములో ఉండును. ఈ గోధుమగడ్డి రసానికి “ఆకుపచ్చ రక్తం ” అనికూడా పేరు కలదు. కేన్సర్ తో బాధపడువారు ఒక గ్లాసు నిండా గోదుమగడ్డి రసాన్ని రోజుకి నాలుగుసార్లు తీసుకొనవలెను . ఇలా రోజుకి నాలుగు గ్లాసుల చొప్పున గోదుమగడ్డి రసాన్ని తీసికొనవలెను .
ఈ గోధుమగడ్డికి జీవమున్న ఆహారం అని పేరు కలదు. దీనిలో ఉండే “క్లోరోఫిల్” రక్తాన్ని శుద్దిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . గోదుమగడ్డి రసంలో ఉండు క్లోరోఫిల్ పార్టికల్స్ హిమోగ్లోబిన్ ని పోలి ఉంటాయి. అందువల్ల రక్తహీనతకు ఐరన్ లా పనిచేయును . ఈ క్లోరోఫిల్ గుండె పనితీరును మెరుగుపరుచును. శరీరవ్యవస్థను , పేగులను , మూత్రకోశం , ఊపిరితిత్తులను బాగుగా ప్రభావితం చేయును . దీనిలో విటమిన్ A , B , ఈ మరియు K పెద్దమొత్తంలో ఉంటాయి. గోధుమ కంటే 600 శాతం అధికంగా విటమిన్ B ను గోధుమగడ్డి కలిగి ఉంటుంది. గోధుమగడ్ది లో కేన్సర్ నివారణకు ఉపయోగపడు B17 పెద్దమొత్తంలో ఉన్నది. గోధుమల కంటే గోధుమగడ్డిలో 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
శరీరంలో 30 రకాల ఎంజైములను చురుకుగా ఉంచడానికి అవసరం అయిన మెగ్నీషియం ఖనిజాలు గోధుమగడ్డి రసములో తేలికగా లభ్యం అగును. ఇప్పుడు మీకు గోధుమగడ్డి రసం వాడటం వలన నయం అయ్యే కొన్నిరకాల వ్యాధుల గురించి తెలియచేస్తాను . అవి
చర్మవ్యాధులు , మానసిక , శారీరక వ్యాధులు , మూత్రకోశ సంబంధ వ్యాధులు , మూత్రపిండాలలో రాళ్లు , మలబద్దకం , కడుపువ్యాధులు , మధుమేహం , గుండెవ్యాధి , కీళ్లు , కండరాల వ్యాధులు , ఆస్తమా , వంధత్వము , కన్ను , చెవి సంబంధ వ్యాధులు , కంపవాతం , దీర్ఘకాలిక జలుబు , అగ్నిమొలలు , వయస్సుకు ముందే జుట్టు నెరవడం , స్త్రీ గర్భసంబంధ వ్యాధులు , నిద్రలేమి , రక్తహీనత , కేన్సర్ వంటి వ్యాధులు
పైన చెప్పిన సమస్యలతో బాధపడువారు రోజుకు నాలుగు గ్లాసుల చొప్పున తక్కువలోతక్కువ 21 రోజులపాటు తీసుకొనవలెను .
తరవాతి పోస్టులో రసం తీసేవిధానం , తీసుకోవలసిన సమయం , చికిత్స మొదలుపెట్టే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సంపూర్ణముగా వివరిస్తాను.
గమనిక –
నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు