నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మి…?

ఉమ్మడి నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మునుగోడు శాసనసభ అభ్యర్దిగా గెలవడంతో… ఎమ్మెల్సీ గా రాజీనామా చేసారు… తాజాగా తెలంగాణ లో సభ్యుల రాజీనామాలతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది.

తాను ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా తిరిగి తమఖాతాలోనే వేసుకోవాలని కోమటిరెడ్డి కుటుంబం భావిస్తోంది… అందులో భాగంగానే… ఇటీవలి శాసనసభ ఎన్నికలలో మునుగోడు నియోజకవర్గంలో భర్త తరఫున అన్నీ తానై ప్రచారం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి కి టికెట్ సాధించే దిశగా కాంగ్రెస్ అధష్ఠానం వద్ద పావులు కదుపుతోంది…

తాజాగా తెలంగాణ లో ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల ప్రక్రియ పూర్తికానందున పాత ఎంపీటీసీ,జడ్పీటీసీ లే ప్రస్తుతం ఓటర్లుగా ఉన్నారు, అంతేకాక కోమటిరెడ్డి లక్ష్మి కి మునుగోడుతో ఎర్పడ్డ ప్రత్యక్ష సంబంధాలు కూడా ఆమె అయితేనే తప్పక విజయావకాశాలు ఉంటాయని పేర్కొన్నారు రాజగోపాల్.

About The Author