ప్రవాసాంధ్రులతో సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్స్…


*రాష్ట్రం కోసం మనం ధర్మపోరాటం చేశాం*.

ధర్మాన్ని మనం కాపాడాం, ఇప్పుడు ధర్మమే మనల్ని కాపాడుతోంది.

కొంతమంది మనకు చెడు చేయాలని చూసినా ప్రకృతి కలిసివచ్చింది.

మంచివారికి మంచే జరుగుతుంది, చెడు చేయాలన్నా మంచే అవుతుంది.

*జన్మభూమి-మావూరు, గ్రామ దర్శని-గ్రామ వికాసం, స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించారు*

ఇంతకు రెట్టించిన స్ఫూర్తితో మరింతగా రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలి.

జన్మభూమి రుణం తీర్చుకోవాలి.

స్వగ్రామం,స్వరాష్ట్రం,స్వదేశం అభివృద్దిలో భాగస్వాములు కావాలి

జన్మభూమి,కర్మభూమి రుణం తీర్చుకోలేనిది.

ఎక్కడ పనిచేస్తున్నారో,ఆ దేశం(కర్మ భూమి) అభివృద్దికి దోహదపడాలి.

ఆ దేశ జిడిపి వృద్దికి మీ ప్రతిభ,కష్టం తోడ్పడాలి.

జెఈఈ మెయిన్స్ లో తొలి 4ర్యాంకులు రాష్ట్రానికే వచ్చాయి.

తెలుగు విద్యార్ధుల ప్రతిభకు అదే నిదర్శనం.

నాలెడ్జ్ ఎకానమిలో మనదే పైచేయి కావాలి.

ఇన్నోవేషన్ లో ఆంధ్రులదే పైచేయి కావాలి.

*ఏపి ఇన్నోవేషన్ హబ్ గా తయారు కావాలి*

100ర్యాంకుల్లో తొలి 25స్థానాలో మనవే కావాలి.

*నాలెడ్జ్ సొసైటిలో 25% వాటా మనదే కావాలి*

పారిశ్రామిక వేత్తలుగా మీరంతా ఎదగాలి, పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలి.

రాబోయే పది,పదిహేనేళ్లలో ప్రపంచంలోనే తెలుగుజాతి సాటిలేని మేటిగా రూపొందాలి.

ఎక్కడ అవకాశాలుంటే అక్కడ ఆంధ్రులను ప్రోత్సహించాలి.

తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపచేయాలి

*ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ప్రతి పౌరుడు ఎదగాలి, ప్రతి ప్రవాసాంధ్రుడు రాణించాలి*

రాష్ట్రంలో 2కోట్ల ఎకరాలకు నీళ్లిచ్చేవిధంగా జలవనరులు అభివృద్ది చేస్తాం.

*ఏపిలో వృద్దిరేటును 15%కు పెంపొందించాలి*

పెట్టుబడి రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం.

ఆరోగ్యకర పంట ఉత్పత్తులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారుకావాలి.

పంచనదుల అనుసందానం చేస్తున్నాం.

నీటిపారుదల ప్రాజెక్టులు 23పూర్తి చేశాం.

రూ.67వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఖర్చు చేశాం.

*నీరు-ప్రగతి, జల సంరక్షణ ఉద్యమం చేపట్టాం*

వీటన్నింటి వల్లే, 5ఏళ్లు వర్షాభావంలో కూడా సాగునీటి కొరత లేకుండా చేయగలిగాం.

వ్యవసాయంలో వృద్ది తగ్గకుండా చూశాం.

*9ఏళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐటిని ప్రోత్సహించాను*

300ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పాం.

*నాలెడ్జ్ ఎకానమిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేశాం*

అందువల్లే రైతుబిడ్డలు ఇంజనీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డారు.

విభజన సమస్యలను పట్టుదలతో అధిగమిస్తున్నాం.

*13జిల్లాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నాం*

డిజిటల్ క్లాస్ రూమ్ లు అభివృద్ది చేశాం.

రూ.5వేల కోట్లతో స్కూల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచాం.

పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాం.

విదేశాలనుంచి పెట్టుబడులు రాబట్టాం, పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం.

*150దేశాల్లో 25లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు*

అందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భాగస్వాములు కావాలి.

*జన్మభూమి అభివృద్దికి చేయూత అందించాలి, సంఘీభావంగా నిలబడాలి*

అప్పుడు జాబు కావాలంటే బాబు రావాలని అన్నారు, ప్రజలంతా ఆమోదించారు.

ఇప్పుడు మళ్లీ నువ్వే రావాలి అన్నారు, ప్రజలంతా మీ వెంటే ఉన్నారు.

మీరు చేసిన కష్టం,మీరు చూపిన చొరవ చాలా ఉపయోగపడింది.

About The Author