కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్నికి 100 కోట్లు…
గోదావరి నదీ తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అధ్బుతమైన పుణ్య క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు వెంటనే 100కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉన్నదని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా కుటుంబ సమేతంగా, ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, పార్వతి మాతని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఆలయ అర్చకులతో కాసేపు కూర్చొని మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత దృష్ట్యా ఇకనుండి ఆలయానికి, ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలివస్తారని దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థాలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ మండపంతో పాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించాల్సి వుంటుందని సీఎం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంలో ఒక మహోత్తరమైన యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. యజ్ఞ యాగాదులకు గోదావరి తీరంలోని ఆలయ ప్రాంతం అణువుగా ఉంటుందని, ఆలయ పునర్నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతి తీర్థ స్వామిని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలు అన్ని పూర్తయిన తరువాత గోదావరి జలాలు ధర్మపురి లక్ష్మి నరసిహ్మస్వామి పాదాలకు తాకే వరకు సుమారు 170 కిలోమీటర్లు నిలిచి ఉంటాయని తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాజెక్ట్ ద్వారా 45లక్షల ఎకరాలకు రెండు పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందివ్వనున్నట్లు సీఎం వివరించారు. ఉద్యమ కాలంలో రామగుండం దగ్గర గోదావరిని చూస్తే దుఖం వచ్చేదని, తెలంగాణకు తరలి రావాలని మొక్కుతూ గోదావరి నదిలో నాణాలు జారవిడిచే వాడినని, ఇప్పుడు తెలంగాణలో కష్టాలు తీరబోతున్నయని సీఎం పేర్కొన్నారు.
అర్చకుల కోసం క్వార్టర్స్ నిర్మిస్తామని, వేద పాఠశాల, కళాశాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. గోదావరి పుష్కర ఘాట్స్ దగ్గర జాలిలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి దంపతులతో పాటు మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు శ్రీ అనురాగ్ శర్మ, చీఫ్ సెక్రటరీ శ్రీ ఎస్.కె జోషి, సీఎం ఓ అధికారి శ్రీమతి స్మిత సభర్వాల్, ఎమ్మెల్యేలు శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి, శ్రీ దాసరి మనోహర రెడ్డి, ఎమ్మెల్సీ లు శ్రీ నారదాసు లక్ష్మణ రావు, శ్రీ భాను ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే శ్రీ పుట్ట మధు, కలెక్టర్ లు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీమతి దేవసేన, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ శ్రీమతి తుల ఉమ, కార్పొరేషన్ల చైర్మన్లు శ్రీ దామోదర్ రావు, శ్రీ ఈద శంకర్ రెడ్డి మరియు ఆలయ చైర్మన్ శ్రీ బొమ్మర వెంకటేశం, ఈఓ శ్రీ మారుతి, సర్పంచ్ శ్రీమతి వసంత తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం తర్వాత కన్నేపల్లి పంప్ హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అటునుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు చేరుకుని అక్కడ పూర్తి కావచ్చిన బ్యారేజ్ పనుల పరిశీలించారు. వ్యూ పాయింట్ వద్ద పనుల పురోగతిని సంబంధిత అధికారుల ద్వారా ఆరాతీసి, మరింత త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టవలసిందిగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ENC వెంకటేశ్వర్లు వర్క్ ఏజెన్సీ ఎల్ అండ్ టీ బాధ్యులకు., పని త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన welders, fitters తదితర సిబ్బందిని దేశంలో ఎక్కడనుంచయినా తక్షణమే తెప్పించి పనులను వేగవంతం చేసేందుకు సహకరించాలని మెగా కృష్ణా రెడ్డిని సీఎం కోరారు. గేటు గేటుకూ సరిపోను సిబ్బందిని దించి మూడు షిఫ్ట్ లల్లో పనిచేయించాలన్నారు. అక్కడనుంచి వాహనంలో బ్యారేజ్ మీద నుంచి ప్రయాణిస్తూ…నడుమ ఆగిన ముఖ్యమంత్రి బ్యారేజ్ నిర్మాణాన్ని గేట్ల బిగింపు, తదితర పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గోదావరి ఈ కొస నుంచి అవతలి కొసకు (మహారాష్ట్ర సరిహద్దు వైపుకు) చేరుకుని అక్కడ కాసేపు ఆగి వాగు మళ్లింపు కాల్వ నిర్మాణం..,మిగిలిన కొన్ని గేట్ల బిగింపుకు సంబంధించి సూచనలు చేశారు. అక్కడ నుంచి 45 డిగ్రీ ల ఎండలోనే వాహనంలో బయలుదేరిన ముఖ్యమంత్రి గోదావరి నీటి కోతను తట్టుకునేందుకు అంచులకు నిర్మిస్తున్న కరకట్టల నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ నుండి తిరిగి బయలుదేరి బ్యారేజ్ కింది కాఫర్ డ్యామ్ మీదుగా గుంతల రోడ్డును సైతం లెక్కచేయకుండా ప్రయాణించి…ఎండలోనే ఆగి వాహనం దిగి…అక్కడ పనిచేస్తున్న కార్మికులను పలకరించి అక్కడ కూడా ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. అక్కడ నుంచి నేరుగా గెస్ట్ హౌజ్ చేరుకున్న సీఎం ఇంజనీర్లతో సమావేశమై రానున్న జూన్ లో వచ్చే గోదావరి వరదను మేడిగడ్డ వద్ద నిలువరించేందుకు చేపట్టవలసిన సత్వర చర్యలను అందుకు తగిన పలు సూచనలను చేశారు. నడి ఎండలో సుడిగాలి పర్యవెక్షణ చేసిన సీఎం వెంట మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్, రాజ్యసభ సభ్యుడు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు, శ్రీ భాను ప్రకాశ్, ఎమ్మెల్యేలు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి, శ్రీ కొరుకంటి చందర్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు శ్రీ అనురాగ్ శర్మ, చీఫ్ సెక్రటరీ శ్రీ ఎస్.కె జోషి, సీఎంఓ అధికారి శ్రీమతి స్మితా సభర్వాల్, కరీంనగర్ ZP ఛైర్పర్సన్ శ్రీమతి తుల ఉమ తదితరులున్నారు. సమావేశం అనంతరం సీఎం తిరిగి రామగుండం హెలికాప్టర్ లో బయలుదేరారు.
గోదావరి నది నుండి రోజుకు 3 టీఎంసిల నీటిని తరలించడం అంటే తెలంగాణ ప్రాంతానికి ఒక నది తరిలి వస్తున్నట్లే అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 45 లక్షల ఎకరాలకు సాగు నీరందించే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వేగవంతంగా పూర్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉందని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో బాగంగా ఆదివారం ఉదయం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకమైన కన్నేపల్లి పంప్ హౌస్ పనులను క్షుణ్నంగా పరిశీలించారు. పంపుహౌస్ లోనికి లిఫ్ట్ ద్వారా దిగి మోటార్ల పంపింగ్ పనితీరు గురించి ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మేయింటనెన్స్ కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. వచ్చే జూలై లోనే రెండు టిఎంసిల చొప్పున నీటిని తరలించి సాగు నీరు అందివ్వడం అంత్యంత శుభపరిణామం అని పేర్కొన్నారు. ఇంత పెద్ద సాగు నీటి ప్రాజెక్ట్ కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తాయని వాటిని పకడ్బందీగా పరిష్కరించి ప్రాజెక్ట్ నిర్వహణ కు భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం అధికారులకు, వర్కింగ్ ఏజెన్సీ లకు సూచించారు.
పనులు వేగాంగా జరగాలనే తొందరలో ప్రాజెక్ట్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దని, కొద్ది సమయం తీసుకున్నా అన్ని జాగృత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా మోటార్ల బిగింపు సహా మొత్తం అన్ని విభాగాల్లో చెక్ లిస్ట్ పూర్తి అయిన తరువాత ట్రయల్ రన్ ప్రారంభానికి తాను, చీఫ్ సెక్రెటరీ కలిసి వస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రక్రియ జూన్ చివరి వరకు పూర్తి చేయాలని సూచించారు.
కాళేశ్వరం నుండి మిడ్ మానెర్ వరకు ఫేస్ 1 గా, మిడ్ మానెర్ నుండి ఫేస్ 2 గా పరిగణించి ప్రాజెక్ట్ పూర్తికి సమయానుగుణంగా పనులు చేయాలని ఆదేశించారు. పంప్ హౌజ్ లు సహా ఇతర ప్రాజెక్ట్ ఆపరేషన్ విషయంలో ఇండిపెండెంట్ వైర్ లెస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. ప్రాజెక్ట్ లో పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేస్తున్నందున అన్ని పంప్ హౌజ్ ల వద్ద మోటార్లకు అందే నీటిలోకి కలప చెట్లు వంటివి వెళ్లకుండా ముందుగానే జాలి తరహాలో ఉండే ట్రాష్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల ప్రయార్టిస్ లో బాగంగా ముందు రెండు టీఎంసిల నీటిని ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తూ మూడో టీఎంసి నీటిని ఎత్తి పోసే పనులను కొనసాగించాలని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగాంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులను, వర్కింగ్ ఏజెన్సీతో పాటు ప్రతి ఒక్క కార్మికుడికి తాను కృతజ్ఞత తెలుపుతున్నాను అని సిఎం అన్నారు. ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ శ్రీ ఎస్ కే జోషి, ఎంపి శ్రీ సంతోష్ కుమార్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లు శ్రీ మురళీధర్ రావ్, శ్రీ వెంకటేశ్వర్లు, మెగా కంపెనీ డైరెక్టర్లు శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.
In order to develop ‘Kaleshwara Mukteshwara Swamy’ temple at the banks of river Godavari as a tourist important destination and a spiritual hub, Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao has announced Rs.100 crores for its expansion and development. CM KCR has stated that, since the prestigious Kaleshwaram irrigation project is in the verge of completion and going to be a lifeline the temple area and the Kaleshwaram area has to be developed as a tourist destination. The state government is determined in this endeavour the CM stated. As part of the ongoing Kaleshwaram project works inspection along with family members and officials CM KCR visited the Kaleshwara Mukteshwara Swamy temple and goddess Parvathi temple on Sunday. Later at the temple premises, CM has spent quality time with the Archakas.
Since the Kaleshwaram project is going to attain utmost prominence, hereafter there will be lakhs of public visiting the place accordingly development has to be made at the temple. In this endeavour, CM has instructed the District Collector to procure 600 acres land for the temple development. For this purpose if required government, private and forest lands need to be acquired the CM felt and directed the officials accordingly. CM also desired to have a Kalyana Mandapam and place for discourses of visiting seers. Accordingly, the temple has to be expanded the CM felt.
As the Kaleshwaram project is successfully on the verge of completion it is proposed to conduct a mega Yagam the CM said. The further CM stated that for rituals like yagnam and yagam the temple being in the banks of river Godavari will be ideal and for the reconstruction of the temple Sringeri Peetadhipathi Sri Bharathi Teertha Swami will be invited. On completion of the Kaleshwaram barrages, river Godavari waters will remain up to 170KMs until they touch the feet of Dharmapuri Lakshmi Narasimha Swamy feet. With the blessings of Kaleshwara Mukteshwara Swamy through the project around 45 lakh acres will be irrigated sumptuously for both the crops the CM said. During Telangana struggle at Ramagundam the sight of Godavari used to bring in tears, I used to pray the almighty for the waters to flow in Telangana and leave coins. Now my prayers are heard and Telangana problems are being addressed the CM said.
Further, CM has also stated that residential quarters will be built for the Archakas besides a Vedic school and a college. It will be an integrated complex. CM has directed the officials to set up a mesh facility at Pushkar ghats to avoid inconvenience to the public. Along with CM and family, Ministers Sri Yerraballi Dayakar Rao, Sri Koppula Eswar, MP Sri Joginapalli Santosh Kumar, Chief Advisor to Government Sri Rajiv Sarma, Advisor to government Sri Anurag Sarma, Chief Secretary Sri SK Joshi, CMO official Ms. Smita Sabharwal, MLAs Sri Gandra Venkata Ramana Reddy, Sri Dasari Manohar Reddy, MLCs Sri Naradasu Lakshman Rao, Sri Bhanu Prakash, Former MLA Sri Putta Madhu, Collector Sri Venkateswarlu, Ms. Devasena, Karimnagar ZP Chairman Sri Tula Uma, Corporation Chairmans Sri Damodar Rao, Sri Eeda Shanker Reddy, Temple Chairman Sri Bommara Venkatesam, EO Sri Maruti, Sarpanch Ms. Vasantha were present.
Hon’ble CM Sri K. Chandrashekar Rao during his visit to Kaleshwaram project on Sunday has said that ‘moving three TMCs of water every day from the Godavari to Telangana areas is like moving one single river’. CM has expressed happiness for bringing the prestigious Kaleshwaram project nearer to completion at a rapid speed. After visiting Kaleshwara Mukteshwara Swamy temple CM has keenly inspected the Kannepally Pump house works progress at Kaleshwaram. Through lift, CM went into the pump house and inspected the motor pumping process. Engineers and Contract agency representatives have explained the CM about the working process of the pump house. On par with the completion of Kaleshwaram Project, its operation and maintenance too are equally vital the CM stated. Prior to July moving of two TMCs water for irrigation is a welcome step the CM said. Speaking to officials and working agencies the CM said that since it is a major project some small technical snags are inevitable they should be meticulously dealt with and prevent recurrence of the same in the future.
Further, the CM said that in the process of speeding up of works one should not compromise on project quality. All precautions are to be ensured even if it takes its own pace of time. After completion of power supply works, fitting of motors and others. After due completion of checklist process for inaugurating the trial run, CM assured to be present along with the Chief Secretary. CM suggested for completion of the same by the end of this June.
From Kaleshwaram to Mid Manair it has to be considered as Phase-I, from Mid Manair it has to be considered as Phase-II and accordingly works need to be completed in a smooth manner the CM suggested. With regard to the operation of the pump house and other projects, an independent wireless system has to be developed the CM felt. Since large size motors are going to be established to prevent unwanted waste material entering into the pump house motors required trash track system has to be established in advance, the CM suggested. In the process of lifting 2 TMCs of water as part of project priority, subsequent efforts are to be on for the due plans to lift 3TMCs water. In this endeavour, all efforts are to be made the CM desired.
CM has further stated that in the process of completing Kaleshwaram project works, the efforts being put in by the Engineering officials, Working agencies and every worker need to be appreciated and thanked. Along with the Chief Minister, Ministers Sri Yerraballi Dayakar Rao, Sri Koppula Eswar, Chief Secretary Sri SK Joshi, MP Sri Santosh Kumar, Engineer in Chief Sri Muralidhar Rao, Sri Venkateswarlu, Mega company Directors Sri Krishna Reddy, Sri Srinivas Reddy several MPs and MLAs were present.