వినయ విధేయతలు ఎప్పుడూ విజయ శిఖరాలని అందిస్తుంది
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది
మనుషుల్లో చాలా తక్కువమందిలో చూస్తుంటాం.
అలాంటిది మూడుసార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా
పనిచేసిన వ్యక్తిగా అలాగే దేశ ప్రధానిగా ఐదేళ్ళు పనిచేసి
తిరిగి మరోసారి ఎన్నికైన వ్యక్తికి ఒదిగి ఉండక్కరలేదు.
తన స్థాయికి ఎలాగైనా ఉండచ్చు అడిగేవాళ్ళు ఎవరు లేరు.
.
అయినాసరే చాలావరకు వినమ్రంగా ఉండడంలో
నిశబ్దంగా పని చేసుకుంటూ మోడీ విజయం సాధించారు.
.
Ofcourse అయన నిజంగా ఒదిగి ఉన్నారా లేక
ఫోటోలకి అలా ఒదిగి ఉన్నారు అని అనేవాళ్ళు ఉన్నారు.
నా ఉద్దేశ్యంలో కనీసం
జనం కోసమైనా అలా వంగి ఉన్నారు కదా.?
అది చాలు ప్రజల మనసు గెలవడానికి.
(సగటు ఇండియన్ మెంటాలిటీ 🙂 )
.
ఈ ఐదేళ్ళలో మన రాష్ట్రానికి వివక్ష లేకుండా
చట్టంలో పొందుపరచినట్టు నిధులు అందించి
ప్రధాని మోడీకి అన్ని రాష్ట్రాలు సమానమే అనే భావనని
AP ప్రజలకి కలిగిస్తారని మరోసారి దేశ ప్రధాని పదవి
చేపట్టినందుకు మా తరుపునుండి హార్దిక
శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుతున్నాం