వచ్చేవారం పోలవరం సందర్శనకు జగన్…


జలవనరుల శాఖ అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష
తాడేపల్లి: పోలవరాన్ని అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అభివర్ణించారు. జలవనరుల శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎంకు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్‌..  వచ్చేవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న మరోసారి జలవనరుల శాఖపై సమీక్షించనున్నారు. సోమవారం జరిపిన సమీక్షలో ఎక్కువ సమయం పోలవరం ప్రాజెక్టుపైనే చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లుఖర్చు చేసిందని.. కేంద్రం నుంచి ఇంకా రూ.4200 కోట్లు రావాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీతో పూర్తిగా నీళ్లు ఇవ్వగలమని అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చలు జరపాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.

About The Author