శఠగోపాన్ని తలమీద ఉంచినపుడు ఏం జరుగుతుందో తెలుసా?

దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థం, శఠగోపం తప్పనిసరిగా తీసుకోవాలి. శఠగోపాన్ని వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. శఠగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. దాని మీద విష్ణువు పాదముద్రలుంటాయి. అంటే మనము కోరుకునే కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించనంతగా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి.

అంటే మన కోరికే శఠగోపం. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. చాలా మంది దేవుని దర్శనం చేసుకున్నాక వచ్చినపని అయిపోయిందని చక చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.

కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోపం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.

శఠగోపాన్ని తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బయటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శఠగోపాన్ని షడగోప్యము అని కూడా అంటారు.

About The Author