ధర్మగిరి వద్దనున్న టిటిడి వారి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం సందర్శించిన గౌ.ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు…

తిరుమల ధర్మగిరి వద్దనున్న టిటిడి వారి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద పాఠశాలను మంగళవారం మధ్యాహ్నం సందర్శించిన గౌ.ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు

అరవై మంది వేద పండిత అధ్యాపకులు, 600 ల మంది వేద విద్యార్థులు ఉపరాష్ట్రపతి గారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు

వేదపాఠశాల ప్రార్థనా మందిరంలో శ్రీవారి పూజ, హారతి అనంతరం వివిధ వేదాంగాల విద్యార్థులు ఉపరాష్ట్రపతి వారి ముందు వేదాలు వల్లించి వారి వేద విద్య ఫటిమను, ప్రతిభను చాటారు. అనంతరం, వేద పండితులు, వేద విద్యార్థులు సామూహికంగా శాంతి మంత్రాన్ని వల్లించి, ఉపరాష్ట్రపతి వారికి వేదాశ్వీర్వచనమ్ అందజేశారు

అనంతరం, ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్య నాయుడు వేద పండితులు, వేద విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ…. టిటిడి వేద పాఠశాల ద్వారా వేద పారాయణం చేసి ..వేద విద్యార్థులు నవ యువ భారత వేద పండితులుగా రూపొందుతుండడం చాలా సంతోషం

వేదం అంటే జ్ఞానం.. మన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే పవిత్ర శక్తి వేదాలకు ఉంది.
మన ప్రాచీన సంస్కృతి, విజ్ఞానాన్ని వేదాల ద్వారా సమాజానికి అందిస్తే సమాజంలో విలువలు, సంస్కృతి పరిరక్షణకు అవకాశం ఏర్పడుతుంది

వేదం వేరు..విజ్ఞానం వేరు కాదు.. నేడు జర్మనీ లాంటి విదేశాల్లో వేదాలపై రీసెర్చ్ చేస్తున్నారు…మరి వేదాలకు పుట్టినిల్లు అయిన మన దేశములో వేదాన్ని.. విజ్ఞానాన్ని వేరు వేరుగా చూసి..వేదాలపై రీసెర్చ్ పెద్ద ఎత్తున చేయడం లేదు

వేదాన్ని ..విశ్వ సాహిత్యంగా స్వామి వివేకానంద పేర్కొన్నారు.

వేదానికి శాస్త్రీయతను
మన అనుభవాన్ని జోడించి..వేదాల పరమార్థాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చేయాలి

మతము వ్యక్తిగతం.. హిందూ సంస్కృతి ఎంతో విశిష్టత పొందింది. హిందూ తత్వం అనేది ఒక జీవన విధానం. ప్రకృతిని ప్రేమించు..ప్రకృతి తో జీవించు అనేది మతం కాదు.. జీవిత సారం. పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువులను పూజించే సంస్కృతి మనది. మన పంట పక్వానికి వచ్చినపుడు పక్షులతో పంచుకునే విధానం, పశువులను పూజించే విధానాన్ని మన వేద విజ్ఞానం నుండి మనం అలవరచు కున్నాం

మంత్రం చెప్పిన తర్వాత మంత్రం అర్థాన్ని కూడా చెబితే సామాన్య జనానికి సులభంగా అర్థం అవుతుంది

ధర్మ పరిరక్షణ ద్వారా సద్బుద్ధి, సన్మార్గం అలవడుతుంది

భక్తులు భగవంతుని పై భక్తితో అందించే కానుకలను హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని భారత ఉప రాష్ట్రపతిగా, వెంకయ్య నాయుడుగా చెబుతున్నానని పేర్కొన్నారు

షేర్ అండ్ కేర్ అనేది మన సంస్కృతిలో భాగం..మన కర్తవ్యం నిర్వహిస్తే ఆనందం.. మన కర్తవ్యం కాని సమాజ హిత కార్యక్రమాలు చేస్తే ఇంకా మహదానందం

వసుధైక కుటుంబం మనది..పురాణ కాలంలో ప్రపంచ దేశాల నుండి మన దేశానికి విజ్ఞాన సముపార్జన కోసం వచ్చి సంస్కృత, ప్రాకృత భాషలో విద్యను అభ్యసించారని విదేశీ చరిత్ర కారులు కూడా చెప్పారు

వేద విద్యార్థులు వేదాల సారాన్ని తమ జీవితానికి అన్వయించుకుని జీవితంలో అభివృద్ధి చెందాలని ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్య నాయుడు గారు ఆకాంక్షిస్తూ వేద పాఠశాలను బాగా నిర్వహిస్తున్న వేద విజ్ఞాన పీఠం వేద పండిత అధ్యాపకులను, టిటిడి వారిని అభినందించారు

అనంతరం, వేద విద్యార్థులు, వేద పండితులతో గ్రూప్ ఫోటో దిగి, వేద పాఠశాల తరగతి గదులను ఉపరాష్ట్రపతి గారు పరిశీలించారు

టిటిడి తిరుమల జేఈవో శ్రీనివాస రాజు, పాంచరాత్ర ఆగమ పండితులు శ్రీ జీఏవి దీక్షితులు, శేషాద్రి ఘనపాటి గారు, వార్డెన్ మరియు వేద పండితులు కె.అశోక్ తదితరులు పాల్గొన్నారు
——————————-

About The Author