ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్…


ఫోర్జరి,మోసం తదితర ఆరోపణలతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నమోదుచేసిన కేసు విచారణను ఎదుర్కొనేందుకు, గచ్చిబౌలి లోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నాడు రవిప్రకాష్…

తన పై రిజిస్టర్ అయిన కేసులలో అరెస్టునుంచి తప్పించుకొనేందుకు ముందస్తు బెయుల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన నేపథ్యంలో ఈ రోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరు కాక తప్పలేదు రవి ప్రకాష్ కు.

అయితే… ఈ కేసులోని మెరిట్స్ ఆధారంగా ముందస్తు బెయిల్ పై విచారించాలని సుప్రీంకోర్టు, హైకోర్టుకు సూచించడం, ఒకవేళ పోలీసులు అరెస్టు చేయదలచిన ముందస్తు నోటీసులు ఇవ్వాలనే సుప్రీం వ్యాఖ్యలను కొంతలో కొంత ఉపశమనంగా భావించ వచ్చు…

About The Author