కనిపించిన నెలవంక : రేపే రంజాన్… ఈద్ ముబారక్
కనిపించిన నెలవంక : ఈద్ ముబారక్
నెలవంక కనిపించింది. ముస్లిం సోదరులు జూన్ 05వ తేదీ బుధవారం పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలని మత పెద్దలు ప్రకటించారు. దీంతో రంజాన్ మాసం మంగళవారంతో ముగిసినట్లైంది. ఇఫ్తార్ ముగిసిన తర్వాత నెల వంక కనిపించడంతో మసీదుల నుండి సైరన్ వినిపించాయి. మరుసటి రోజు పండుగ చేసుకోవాలని సూచిస్తుంది ఈ సైరన్.
పలువురు శుభాకాంక్షలు : –
ముస్లింల జీవితంలో అత్యంత కీలకమైన పవిత్ర రంజాన్ మాసం చివరగా జరుపుకొనే ‘ఈద్ ఉల్ ఫిత్ర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మసీదుల నుండి ప్రకటన వెలువడడంతో ‘ఈద్ కా చాంద్ ముబారక్’ అంటూ పరస్సరం శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, దేశ ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతరులు ముస్లిం సోదరులకు రంజాన్