కోడెల కుమారుడి అరెస్టు కు రంగం సిద్ధం….?
కోడెల కుమారుడి అరెస్టు కు రంగం సిద్ధం….? ఏక కాలంలో గుంటురు, హైదరాబాద్ లలో డిల్లీ పోలీసుల తనిఖీలు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు డా|| కోడెల శివప్రసాదరావు కుమారుడు, డా|| కోడెల శివరామకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమైందని అంటున్నాయి స్థానిక టీడీపీ వర్గాలు…
గుంటూరు జిల్లాలో కేబుల్ వ్యాపారం నిర్వహించిన శివరామకృష్ణ… 70 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.. వివిధ కంపెనీలు చేసిన ఫిర్యాదు తో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు గత రాత్రి నుంచి కోడెల శివరాం కి సంబందించి హైదరాబాద్, గుంటూరు లోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లి పోలిసులతో పాటు ఈడి అధికారులు కూడా ఉన్నారని సమాచారం.
అయితే, ఇదంతా కూడా కేబుల్ పైరసీ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్న సోదాలేనని.. ఇందులో ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవని పేర్కొన్నాయి.. శివరాంపై కేసులు పెట్టిన కంపెనీలు…
కేబుల్ కనెక్షన్ వ్యాపారం లో పైరసీ చేసిన శివరాం, 70 కోట్లకు పైగా కేబుల్ కంపెనీలకు నష్టం కలిగించారని సదరు కంపెనీలు కోర్టు కి ఆదారాలు సమర్పించాయి.
ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు.. భారత దేశ చరిత్ర లో ఇంత భారి స్దాయి లో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్ పైరసీ కేసు ఇదే అని వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో.. ఢిల్లి పోలిసులు కోడెల శివరామకృష్ణ ను ఏక్షణానైనా అరెస్టు చేసెందుకు సిద్దమైనట్లు సమాచారం.
డా||కోడెల శివప్రసాదరావు, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత స్పీకర్గా ఎన్నికయ్యారు. అయితే, ఆయన కుమారుడు పరోక్షంగా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపించేవి
ముఖ్యంగా నియోజకవర్గంలో కె టాక్స్ అనగా కోడెల టాక్స్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి… విపక్ష నేత హోదాలో జగన్ కూడా పాదయాత్ర చేసిన సమయంలో ఇదే విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు.