లోక్ అదాలత్ చట్టం–1987భారతదేశ న్యాయశాస్త్రాల వల్ల “కోర్టుకు వెళ్లిన వాడు కొంప కూల్చుకున్నట్లు అనే సూక్తి నుండి “ఓడిన వాడు కోర్టులో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడని” పురాతననానుడి ఒకటి ఉంది. అదే నిజమనే విధంగా మన న్యాయస్థానలలో న్యాయవిచారణ పేరిట అన్యాయపు విచారణ జరుపుతున్నారు. మన న్యాయశాస్త్రాలైన *న్యాయవ్యవస్థ- పౌర న్యాయ విధాన నిర్ణయ శాస్త్రం అధికారాలు- 1908, నేర నిర్ణయ విధాన న్యాయ శాస్త్రం/ క్రిమినల్ ప్రోసిజర్ కోడ్- 1973, భారత శిక్షాస్మృతి- 1860, భారత సాక్షాధారాల చట్టం – 1872 లోని నిబంధనలను అనుసరించి సత్వర న్యాయ విచారణ చేయాలి. కాని న్యాయశాస్త్రాలపై పూర్తిస్థాయిలో అవగాహన లేని వ్యక్తులను న్యాయమూర్తులుగా, మరికొంతమందిని ప్రభుత్వ న్యాయవాదులుగా నియమిస్తున్నారు.

ప్రజాధనాన్ని తమ ఇష్టారీతిగా దుర్వినియోగపరుస్తున్నారు. శీఘ్రంగా విచారణ జరపాల్సిన అంశాలను ఏళ్ళూ గడిచినా సత్వర న్యాయం కనుచూపు మేరలో పరిష్కారం లభించని పరిస్థితి ఉన్న ప్రజాస్వామ్యంలోకి వెళ్ళిపోయాము.

ఆర్టికల్ 39( ఏ)ప్రకారం ఉచిత న్యాయ సేవ అందించాలనే ఉద్దేశంతో న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరిగేటట్లు చూడడానికి ప్రభుత్వాలు కృషి చేయవలసి ఉంటుంది న్యాయసహాయం అందరికీ అందుబాటులో రావాలి. ఆర్థిక దుస్థితి వలన లేక మరే ఇతర కారణం వల్ల గానీ న్యాయాన్ని పొందే అవకాశం కొందరికి లేకుండా పోయే పరిస్థితి ఉండకూడదని ఈ పరిస్థితిని నివారించేందుకు అటువంటి వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడానికి తగిన శాసనాలను ఇతర పథకాలను ప్రభుత్వాలు రూపొందించాలి. ఈ ఆర్టికల్ ను 1977లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ ను అదనంగా చేర్చబడింది. దాని ద్వారానే లోక్ అదాలత్ చట్టం ప్రజల బాధలను తీర్చడానికే ప్రభుత్వం వారు లోక్ అదాలత్ చట్టం – 1987ను అమలులోకి తెచ్చారు.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు :-
ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం వివిధ స్థాయిలలో న్యాయసేవల కమిటీలను నియమించాలి. న్యాయసేవల కమిటీలు తమ అధికార పరిధిలో ఎప్పటికప్పుడు ప్రజల బాధలను తీర్చడానికి, సత్వర న్యాయాన్ని అందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. తమ ప్రాంత పరిధిలో ప్రతి రెండవ శనివారం, లేదా సంబంధిత న్యాయమూర్తి విచక్షణాధికారం మేరకు ప్రతి శనివారం కూడా లోక్ అదాలత్ నిర్వహించవచ్చు. ఈ విశేషాధికారం ప్రజాప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం న్తాయస్థానంలోని న్యాయమూర్తులకు ఇచ్చారు.

లోక్ అదాలత్ చట్టం 1987 లోని ముఖ్యాంశాలు నిబందనలు

1) వివాదాలలో ఉన్న అంశాలలోని వాది – ప్రతివాదుల మధ్య న్యాయస్థానలలో విచారణ జరిగే విషయాలను పరస్పరం రాజీ కుదుర్చుకోవాలన్న బలమైన సంకల్పము ఉండాలి.

2) ఇరు పక్షాల వారు పరస్పర అంగీకారంతో లోక్ అదాలత్ లచే ఇవ్వబడే తీర్పులు, ఇరు పక్షాల మధ్య, ఇరు పార్టీల మధ్య రాజీ కుదరనిపక్షంలో సదరు దావాలను తిరిగి సదరు న్యాయస్థానములకు పంపవలసి ఉంటుంది.

లోక్ అదాలత్ లలో పరిష్కరించబడే కేసులు

మోటారు వావాన ప్రమాద కేసులు,
వివాహ సంబంధమైన,
రాజీకి వీలైన నేరపూర్వకమైన,
కార్మిక వివాదాల,
బ్యాంకు వసూలుకు సంబంధించిన,
మొబైల్ సెల్యూలర్ కంపెనీలతో వివాదాలకు సంబంధించిన,
వినియోగదారులకు సంబంధించిన,
గృహ నిర్మాణ మరియు మురికి వాడలకు సంబంధించిన,
నీటి సరఫరా,
విద్యుత్,
భీమా,
వైద్యం వంటి
సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి.

ఈ అదాలత్ ల‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సత్వరం న్యాయం పొందవచ్చును.
ఈ అదాలత్ న్యాయ స్థానాలలో పరిష్కారమయే కేసులపై ఎక్కడ అప్పీల్ చేయడానికి వీలు లేదు.
ఈ అదాలత్ ఇచ్చే పురష్కారంలు, ఉత్తర్వులు కానీ స్వభాషలోనే ఇవబడుతుంది.₹ పది లక్షల లోపు వివాదం ఉన్న సమస్యలపై కేసులను ఈ అదాలత్ లు పరిష్కరిస్తాయి.ఇందులో ఆయా ప్రభుత్వ-ప్రైవేట్ కి సంబంధించిన శాఖలలో గతంలో పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తితో పాటు మరో సభ్యుడు, జిల్లా జడ్జి స్థాయి న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు. కేసును దాఖలు చేయడం కోసం ఎటువంటి రుసుం ఉండదు.న్యాయవాది అవసరం ఉండదు.

భారత శిక్షాస్మృతి – 1860లోని నిబంధనలను అనుసరించి వాది – ప్రతివాది ప్రమాణ పూర్వక సాక్ష్య స్వీకరణ, అఫిడవిట్ ల ద్వారా సాక్ష్యమును స్వీకరించి సివిల్ న్యాయస్థానంల విచారణ ప్రారంభిస్తుంది.న్యాయస్థానాలు నిర్వహించి విచారించే లోక్ అదాలత్ లలోని న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వాది-ప్రతివాది ప్రవర్తించినట్లయితే వారిపై192 ప్రకారం అబద్ధపు సాక్ష్యంను వ్రాత ప్రతి ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ రికార్డు ద్వార గాని సృష్టించిన, నిబంధన 193 ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన, న్యాయ ప్రక్రియను భంగపరిచిన నిబంధన 219 ప్రకారం న్యాయ సంబంధమైన ప్రక్రియలో చట్ఠ విరుద్ధంగా వ్యవహ‌రించుట జరిగితే వారికి ఏడు సం.ల వరకు జైలు శిక్ష మరియు జరిమాన లేదా రెండూ విధించవచ్చు.నిబంధన 228 ప్రకారం న్యాయ ప్రక్రియా విధి నిర్వహణలో ఉద్యోగులను ఎవరైనా ఉద్ధేశపూర్వకంగా అవమానించినా లేదా అవరోధం కలిగించినా ఆరు నెలల వరకు సాధారణ జైలు శిక్ష లేక వెయ్యి రూపాయల వరకు జరిమానాతో గానీ లేక రెండు విధించవచ్చును.

న్యాయ సేవల కమిటీ ద్వారా *లోక్ అదాలత్*వారు, ఇరుపక్షాల వారు పరస్పర అంగీకారంతో వెలువరీంచి వెలవడే తీర్పులు *లోక్ అదాలత్*వారు 20(1) ఇచ్చే తీర్పులు సాధారణ సివిల్ న్యాయ స్థానాలు, లేక ఇతర న్యాయ స్థానాల ఆదేశంతో సమానము.ఈ అంశం తలెత్తితే ఆ సంధర్భంలో *న్యాయవ్యవస్ధ*-పౌర న్యాయవిధాన నిర్ణయ శాస్త్రం అధికారాలు-1908లోని 151 నిబంధన ప్రకారం ఇచ్చిందని భావించాలి.

లోక్ అదాలత్ వారు వెలువరించే తీర్పులు ఏ న్యాయస్థానాలలో అప్పీలు చేయడానికి వీలు లేదు.

న్యాయ సేవ సంస్థలు ఈ క్రింది స్థాయి వారికి న్యాయస్థానాలలో కేసు దాఖలు చేయుటకు లేదా తమమీద మోపబడిన కేసులో ప్రతివాదనలు చేయుటకు ఉచితంగా న్యాయస్థానం న్యాయ సహాయం చేస్తుంది అందుకు బాధితులు సమీపంలోని న్యాయ సేవా కేంద్రాన్ని సంప్రదించి న్యాయం పొందే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఆందుకోలేని వారు,సమాచారం అందుకున్న వారిలో తప్పుడు సమాచారం పొందినవారు కూడా న్యాయ సహాయం పొందవచ్చును. సమాచార హక్కు చట్టం కింద హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎటువంటి ఖర్చు లేకుండా కింది విధంగా పేర్కొన్న నిబంధనల ప్రకారం అర్హులైన వారు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు. రాజ్యాంగ అధికరణ 22 1 39 ప్రకారం పొందవచ్చు ఎవరైనా నిందితుడు తొలిసారిగా అరెస్ట్ కాబడినప్పుడు మేజిస్ట్రేట్ ముందు హాజరైన అప్పటి నుండి విచారణ సమయంలోనూ అప్పీల్ సమయములోనూ న్యాయసహాయం అందించడం అనేది ప్రభుత్వంపై రాజ్యాంగం అప్పగించిన కీలకమైన బాధ్యత. రాజ్యాంగం ప్రభుత్వంనకు అప్పగించిన బాధ్యత నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వము ప్రయత్నం చేయజాలదు.నేర ప్రక్రియ స్మృతి 1973లో నిబంధన 304,సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 లోని ఆర్డర్ 33 రూల్ – 17 ప్రకారం ఎవరైనా వ్యక్తి తనకు సంబంధించిన కేసు వాదించుకోవడానికి న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితిలో ఉన్న నిస్సహాయ వ్యక్తుల కోసం నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని సంవత్సరానికి 50 వేల రూపాయల ఆదాయం కూడా లేని వారికి కోర్టు ఫీజు మినహాయింపు ఉంటుంది. అందుకు వారు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి గౌరవ హైకోర్టు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ అనికానీ, గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యూఢిల్లీ వారికి అని తమ లేఖ ద్వారా విన్నవించుకోవడం ద్వారా న్యాయ సేవా సంస్థ నుండి ఉచితంగా న్యాయం పొందవచ్చు.

ఏయే అంశాలలో న్యాయ సేవా సంస్థల నుండి ఉచితంగా న్యాయ సమస్యలు పొందవచ్చు??

1.సంవత్సరం ఆదాయం 50000 దాటని వ్యక్తులకు
2. షెడ్యూల్ కులాలు ,షెడ్యూల్డ్ తెగలు వ్యక్తులు
3.సామూహిక వైపరీత్యాలు కుల మత హింస బాధితులు
4.నిర్బంధంలో ఉన్న వ్యక్తులు
5. గృహహింసకు గురి అయిన మహిళలు,బాల నేరస్తుల గృహాలలోని పిల్లలు మానసిక ఆసుపత్రులలోని రోగులు
6. వెట్టిచాకిరి కోసం అమ్ముడుపోయిన వారు
7. పరిశ్రమలో కార్మికులు
8. వికలాంగులు
9. స్త్రీలు పిల్లలు……..
10. రైతులు పట్టాదారు పసుపుస్తకం మంజూరు చేయకుండా తమకార్యాలయలు చుట్టూ తిప్పకుంతున్న కేసులు.
11. వృద్ధులను తమ పిల్లలను పొచించుకుపోయిన …..

About The Author