భారతదేశం లోనే తొలి బ్రాహ్మణ భవన్ సిద్దిపేటలో..!
భారతదేశం లోనే తొలి బ్రాహ్మణ భవన్ సిద్దిపేటలో..!
నాటి ఎమ్మెల్యే గా, నేటి ముఖ్యమంత్రి గా సీఎం కేసీఆర్ గారు భారత దేశంలోనే తొలి బ్రాహ్మణ భవనం సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ పరిషత్ అంటే వేద పండితులకు ఉపనాయణలకు ఆధ్యాత్మికకు కొలువై ఉండాలి. ధార్మిక కార్యక్రమాలకు వేదికగా నిలవాలి. సిద్దిపేటకు వచ్చే పీఠాధిపతులకు ఈ భవనం విడిదిగా చేయాలి. బ్రాహ్మణ మహిళలకు చేయూత నిచ్చే విధంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి, సబ్సిడీ ఇచ్చి వారిని వెలుగులోకి తేవాలి. సమాజానికి బ్రాహ్మణులు అవసరం వారు లేకుండా పురహితం జరగదు. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ ప్రజలకు, పురోహితులకు ఒక సేవా కేంద్రంగా, వివాహాది శుభకార్యలకు పురోహితులు అందుబాటులో ఉండే విధంగా చేయాలి. మన దేశం లో ఉన్న ఆధ్యాత్మిక పుస్తకాలు మన భవన్ లో ఉండే విధంగా గ్రంధాలయం ఏర్పాటు. బ్రాహ్మణుల శుభాకార్యాలకు కోటిలింగాల గుడి, శివానుభవ మండపం, కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయం, సిద్దిపేట ధ్యాన మందిరం లాంటి భవనాల్లో చేసుకోవచ్చు. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ వేడుకలకు మాత్రమే నిలయంగా కాకుండా ఒక ధార్మిక, ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఈ భవనం మార్పు తెచ్చలా కృషి చేస్తాము. ఆ దిశగా అడుగులు పడేలా పరిషత్ సభ్యులు ఐక్యత తో ఉండాలి.