గిరీష్ కర్నాడ్ కన్నుమూత
ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ రఘనాథ కర్నాడ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. రచయితగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు ఆయనను వరించింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఒకప్పటి బొంబాయి ప్రెసిడెన్సీ,ప్రస్తుతం మహారాష్ట్ర లోని మథేరన్ లో మే 19, 1938 లో జన్మించారు.
గిరీష్ గారి తల్లికి మొదట పెళ్ళైన కొద్దికాలంలోనే భర్త చనిపోయారు, అప్పటికే కలిగిన ఒక కుమారుడు తో… బొంబాయి మెడికల్ సర్వీసెస్ లో నర్స్ ట్రైనింగ్ కు చేరారు, అక్కడే వైద్యుడిగా పనిచేస్తున్న డా|| రఘునాథ కర్నాడ్ ఆమెను ఇష్టపడినా… అప్పటి సమాజంలోని వితంతు వివాహ వ్యతిరేక భావాల వల్ల ఐదు సంవత్సరాల పాటు వేచిఉండి, ఆతర్వాత ఆర్యసమాజ్ లో పెళ్ళి చేసుకొన్నారు. ఈ దంపతులకు కలిగిన నలుగురు సంతానంలో… గిరీష్ మూడవ వారు.
1958 లో ధార్వాడ్ లోని కర్నాటక విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న కర్నాటక్ ఆర్ట్స్ కాలేజీ నుంచి గణిరమ, సంఖ్యాక శాస్త్రం లో పట్టభద్రుడయన గిరీష్ కర్నాడ్ ఉన్నత చదువులను ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్ లో అభ్యసించారు.
బాల్యం నుంచే కళల పట్ల అభిరుచి, అభినివేశం గల గిరీష్… రచయితగా, అధ్యాపకుడిగా, నటుడుగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనడం అతిశయోక్తి కాదు.
2000–2003 సంవత్సరాల మధ్య లండన్ లోని భారత రయబార కార్యాలయంలో… నెహ్రూ సెంటర్ డైరెక్టర్ గా పనిచేశారు గిరిష్ కర్నాడ్.
1974–1975 మధ్యకాలంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు నిర్దేశకుడిగా… 1988–93 మధ్యకాలంలో జాతీయ సంగీత,నాటక అకాడమీ ఛైర్మన్ గా సేవలందించారు గిరీష్ రఘునాథ కర్నాడ్..
90 వ దశకం మొదట్లో దూరదర్శన్ లో ప్రసారమైన సైన్స్ ఆధారిత కార్యక్రమం టర్నింగ్ పాయింట్.. గిరీష్ కెరీర్ లో ఓ మేలి మలుపు గా పేర్కొన వచ్చు… ఆతర్వాత 1986–1987 మధ్యకాలంలో.. ఆర్కే నారాయణ్ నవల ఆధారంగా నిర్మంచిన మాల్గుడి డేస్ లో స్వామీజీ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసారు గిరీష్.
ఆనంద భైరవి, ధర్మచక్రం, శంకర్ దాదా MBBS, కొమరం పులి వంటి తెలుగు సినిమాలలోని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన ఓగొప్ప నటుడు, దర్శకుడు,రచయిత ఈ రోజు శాశ్వతంగా కళామతల్లికి దూరమవడం… ఆమెకు గర్భశోకమే…
గిరీష్ రఘునాథ కర్నాడ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా… ఆతని కళాతృష్ణ భావితరాలకు దిక్సూచి కాగలదని ఆశిస్తూ…. #నిజం ఘన నివాళి అర్పిస్తోంది…