రైతుబంధు ద్వారా అందించే పెట్టుబడి సహాయం త్వరలోనే…
రైతుబంధు ద్వారా అందించే పెట్టుబడి సహాయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు చేరేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. ఎన్నికల కోడ్, విధులు ముగిసినందున రైతుల డాటా సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
సోమవారం రైతు బంధు, 2021 జనాభా లెక్కల సమీకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో సి.యస్ డా.ఎస్ కె.జోషి సచివాలయంలో వీడియోకాన్ఫరెన్స్ ను నిర్వహించారు.
ఈ సమావేశంలో జి.ఎ.డి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా , వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారథి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా, పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లోని అంశాలు:
రైతు బంధు సహాయం అంధించడానికి CCLA నుండి డిజిటల్ సంతకం చేసిన పట్టాదారుల డాటా, పట్టాదారుల విస్తీర్ణం సేకరించడమైనది.
ఖరీఫ్ 2019 రైతు బంధు సహాయానికి CCLA వద్ద ఉన్న 54.56 లక్షల పట్టాదారులకు సంబంధించి 140 లక్షల ఎకరాలకు సంబంధించి వివరాలు సేకరించడమైనది.
ఈ కుబేర్ ద్వారా పట్టాదారుల ఖాతాలకు నిధులు జమ చేయడం జరగుతుంది.
పట్టాదారుల బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి పోర్టల్ లో అప్ లోడ్ చేయవలసి ఉన్నవి.
జిల్లా కలెక్టర్లు ఈ విషయం పై ప్రత్యేక శ్రద్ద వహించి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించాలి. రైతులు బ్యాంక్ ఖాతాల వివరాలు AEO లకు ఇవ్వాలని పత్రికల ద్వారా ప్రచారం గావించాలి.
ROFR పట్టాలకు సంబంధించి చనిపోయిన వారికి సంబంధించి వివరాలను కమీషనర్ గిరిజన సంక్షేమ శాఖ నుండి తీసుకోవాలని నిర్ణయించడమైనది.
జిల్లా కలెక్టర్లు ROFR పట్టాదారుల పేరు విస్తీర్ణం, మొబైల్ నెంబర్ తదితర వివరాలు గిరిజన సంక్షేమ కమీషనర్ కు సమర్పించాలి.
ROFR పట్టా వివరాలను కమీషనర్ గిరిజన సంక్షేమ శాఖ వారి అనుమతితో వ్యవసాయ శాఖకు లిస్టు సమర్పించడానికి అంగీకరించడమైనది.
జూన్ 3 నుండి బిల్లులు సమర్పించి నిధులు ఖాతాలకు జమ చేయడం జరిగింది. తేది. 07.06.2019 వరకు 7.19 లక్షల పట్టా దారులకు 781.17 కోట్లను రైతుల ఖాతాలకు జమచేయడమైనది.
రైతు బంధు సహాయాన్ని Give IT UP చేయదలుచుకున్న వారు. Give IT UP ధరఖాస్తును AEO/MAO కు సమర్పించాలి ఇట్టి నిధులన్ని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితీకి బదిలీ చేయడం జరుగుతుంది.
మీడియా ద్వారా Give IT UP పై విస్తృత ప్రచారం నిర్వహించాలి.
2018 ఖరీఫ్, రబీల రైతు బంధు అమలు విజ్ఞప్తులను పరిశీలించడం కుదరదు.
ఖరీఫ్ 2019 రైతు బంధు సహాయానికి జూన్ 10 నాటికి డిజిటల్ సంతకాలు చేసిన రైతులకు సహాయం అందించడం జరుగుతుంది. తదుపరి ఇంక్రిమెంటల్ డాటాను పరిగణలోకి తీసుకోవడం జరుగదు.
2021 జనాభా లెక్కల సమీకరణ:
2021 సెన్సెస్ కు సంబంధించి గ్రామ, పట్టణ రిజిష్టర్ల వివరాలను నవీకరించి సమర్పించాలని జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 2011 జనాభా లెక్కల అనంతరం గ్రామ, పట్టణ రిజిష్ట్రర్లలో వివరాలను అప్ డేషన్ చేసి సమర్పించాలని అన్నారు. తేది. 1-1-2010 నుండి 31-12-2019 వరకు పట్టణ/మండల/గ్రామ/జిల్లా స్ధాయిలో ఏర్పడిన Jurisdictional changes వివరాలను ఇవ్వాలన్నారు. పట్టణాలు, మున్సిపాలిటీల సమీపంలో ఏర్పడిన అర్భన్ Agglomerations వివరాలు పంపాలన్నారు. 2021 జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ప్రిపరేటరీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను కోరారు. ఈ విషయమై కలెక్టర్లు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. జనాభా లెక్కలకు సంబంధించి జిఏడి ద్వారా కలెక్టర్లకు సర్కులర్ లను పంపించామన్నారు.