కోడెల కుటుంబం చేతిలో ఓడిన రంజీ క్రికెట్ క్రీడాకారుడు…

ఇతని పేరు నాగరాజు.

ఆంధ్రా క్రికెట్ జట్టు లో క్రీడాకారుడు

రైల్వే లో ఉద్యోగం ఇప్పిస్తానని 15 లక్షలు లంచంగా తీసుకున్న కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివ రామ్.

అతనొక క్రికెట్ ప్లేయర్ వెనుకబడిన జిల్లాగా పేరు పొందిన శ్రీకాకుళం జిల్లా వాసి అయిన అతను తన శక్తి సామర్ధ్యాలతో ఆంధ్ర క్రికెట్ జట్టు లో చోటి జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.2016 లో ఏకదాటిగా ఎనభై రెండు గంటలు క్రికెట్ ఆడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు తో పాటు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న క్రికెట్ క్రీడాకారుడు. ఈ తరుణంలో అతనికి పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు అతనికి ధన రూపంగా ఎంతో సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు అందించారని అందులో భాగంగా అమరావతి మంగళగిరిలో గల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నందు తర్ఫీదు పొందేందుకు వచ్చానని చెప్పాడు. అక్కడ భరత్ చంద్ర అనే కమ్మ కులానికి చెందిన వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పారు. నాగరాజు కు రైల్వే ఉద్యోగం పై ఉన్న మక్కువను గమనించిన చంద్ర తనకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2017 డిసెంబర్ 31వ తేదీన అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడైన కోడెల శివరాం వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేసి రైల్వే ఉద్యోగం పై ఉన్న మక్కువను తెలియజేసి ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. అప్పుడు కోడెల శివ రామ్ సమ్మతించి సరే అన్నట్లు పేర్కొన్నాడు. ఈ తరుణంలో 2018 డిసెంబర్ 27 న నరసరావుపేట లోని కోటకు రమ్మని చెప్పగా అదే రోజు తాను వెళ్లగా, అభినందనలు నాగరాజు అంటూ నువ్వు రైల్వే ఉద్యోగం కు ఎంపిక అయ్యావని సెలెక్ట్ అయిన పత్రాలను చేతిలో పెట్టి రూ.15 లక్షలు తీసుకొని కాన్పూర్ క్యాంప్ దగ్గరకు వెళ్ళమని చెప్పారని పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నాడు. అక్కడ కోడెల శివరామ్ మనిషి ఠాగుర్ అనే వ్యక్తి ,సార్, నాకు అన్నీ చెప్పారని స్పోర్ట్స్ కోటాలో కాలింగ్ లెటర్ వస్తుందని చెప్పారని పేర్కొన్నాడు. సంవత్సరం పాటు ఓపిక పట్టానని, ఎన్నికల ఫలితాలు అనంతరం కోడెల శివరామ్ పై వస్తున్న K ట్యాక్స్ కేసులు చూసి కోడెల శివప్రసాదరావు కు సెల్ ఫోన్ ద్వారా తెలియ జేశానని చెప్పాడు. నరసరావుపేట నందు జూన్ నెలలో కలవాలని పేర్కొన్నట్లు చెప్పగా కలిసి రూ.15 లక్షల బాండును చూపించినట్లు పేర్కొన్నాడు. అప్పుడు కోడెల శివరామ్ మనుషులు కొట్టి తన వద్ద ఉన్న బాండ్ ను లాకున్నారని తెలిపాడు. తిరిగి మాజీ స్పీకర్ కోడెలకు ఫోన్ చేయగా 14 వ తేదీన గుంటూరు లోని మూడు వంతెనల వద్ద గల శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్దకు రమ్మన్నారని అక్కడే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు వేచి చూశానని ఫోన్ చేయగా రెస్పాండ్ అవ్వక పోవటంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో నరసరావుపేట డీఎస్పీ రామ వర్మకు రాతపూర్వకంగా పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

About The Author