గర్భిణిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త, చికిత్స పొందుతూ మృతి…


విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ కృష్ణలంకలో ఈరోజు తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. గర్భిణిపై భర్త పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్యపై అనుమానంతో భర్త ఈఘాతుకానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. మృతురాలు శైలజ కృష్ణలంకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. శైలజ భర్త నంబియార్‌ గుడివాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About The Author