శ్రీ కేటీఆర్ గారి చొరవతో 39 మంది ఈరోజు సౌదీ నుంచి హైదరాబాద్ కు


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి చొరవతో 39 మంది తెలంగాణ కార్మికులు ఈరోజు సౌదీ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు.

కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు గత ఏడాది సౌదీలో నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. అయితే గత ఆరు నెలలుగా వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా కంపెనీ పని చేయించుకోవడంతో పాటు సరైన, ఆహారాన్ని కూడా సంస్థ అందించలేకపోయింది. తిండికి, ఉపాధికి అనేక కష్టాలు పడుతున్న వీళ్లు, తమ సమస్యను ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి తెలియజేయడం జరిగింది. కార్మికుల సమస్యల పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సియస్ ఎస్కే జోషిని కేటీఆర్ కోరారు. దీంతోపాటు సౌదీ లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు కూడా కేటీఆర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. సౌదీ లోని భారత రాయబార కార్యాలయం స్పందించి, కార్మికుల సమాచారం ఆధారంగా వారిని గుర్తించి తెలంగాణకి పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. తమ వద్ద ఉన్న వర్క్ పర్మిట్ వీసా గడువు పూర్తవడంతో భారత రాయబార కార్యాలయం వారికి తాత్కాలిక ఎగ్జిట్ విసాలను ఇవ్వడం జరిగింది. వీరందరికీ విమాన టికెట్లను సమకూర్చి తెలంగాణకి పంపించడం జరిగింది. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయభార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు దన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు కార్మికులను తెలంగాణ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుని వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేశారు.

About The Author