చంద్రబాబు ను ఖచ్చితంగా ఖాళీ చేయించి తీరుతాం… ఆర్కే
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి(ఆర్కే) అసెంబ్లీ ఆవరణలో.. మీడియా తో కాసేపు ముచ్చటించారు…
రాజధాని పనులు ఆగిన విషయం తనకు తెలియదు అన్న ఆర్కే… పనులు ఎందుకు నిలిపివేశారో కాంట్రాక్టర్ లు సమాధానం చెప్పాలి,కాంట్రాక్టర్ లకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని పేర్కొన్నారు.
ఎక్సెస్ టెండర్ లపై అప్పుడే అంత ఆందోళన ఎందుకు అంటూ ప్రశ్నించారు ఆర్కే…
CRDA చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు…ఆ పోస్ట్ నాకు ఇస్తున్నారన్న సమాచారం తనకు లేదన్న ఆర్కే…కరకట్ట మీద అక్రమ నిర్మాణాలపై కోర్ట్ లో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసారు.
మాజీ సీఎం చంద్రబాబు ఉండేది అక్రమ నిర్మాణం లోనే… ఖచ్చితంగా చంద్రబాబు ను ఆ నివాసం నుంచి కాళీ చేయిస్తాం అన్నారు ఆర్కే…
అమరావతి లో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు. జగన్ తాడేపల్లి లో ఇల్లు కట్టుకున్నాడు, మరి బాబు ఎక్కడ కట్టుకున్నాడు అంటూ ప్రశ్నించారు.