జూన్ 26 నుండి జులై 3 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ విత్తన సదస్సు…


జూన్ 26 నుండి జులై 3 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ విత్తన సదస్సు – వేదికలు, రవాణా, భోజన వసతులపై సూచనలు – విత్తన సాంకేతిక సమావేశాలు, విత్తన రైతుల సమావేశాలు, ఎగ్జిభిషన్లు, సదస్సుకు భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖులకు ఆహ్వానాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలపై తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఆహ్వానాలు సకాలంలో అందజేయాలి, అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులను ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో ప్రతిష్టాత్మకంగా సదస్సు – 70 దేశాల నుండి 800 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. తొలిసారి ఆసియాలో అదీ భారతదేశంలో విత్తన కాంగ్రెస్ (ISTA – 2019) సదస్సు దాని నిర్వహణ తెలంగాణకు దక్కడం, దానిని హైదరాబాద్ లో నిర్వహిస్తుండడం మనకు గర్వకారణం. సదస్సులో భాగంగా 1500 మంది రైతులతో తెలంగాణ విత్తన రైతుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించాలి.
విత్తన సంస్థలతో ఇస్టా ప్రతినిధుల ముఖాముఖి ఏర్పాటు హాజరయిన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి గారు, కమీషనర్ రాహుల్ బొజ్జ గారు, తెలంగాణ సీడ్స్ డైరెక్టర్ కేశవులు గారు, ఇతర అధికారులు.

About The Author