పులకించిన వరుణుడు.. కాళేశ్వరంలో వర్షం…


పులకించిన వరుణుడు.. కాళేశ్వరంలో వర్షం

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేపట్టిన మహాయజ్ఞం కాళేశ్వరం ప్రాజెక్టును వరుణుడు ఆశీర్వదించాడు. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కానుండగా ఇవాళ భారీ వర్షం కురియడంతో దీన్ని శుభసూచకంగా భావిస్తున్నారు. భారీ వర్షం కురియడంతో అధికారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్‌, పోలీసు ఉన్నతాధికారులు ఇవాళ పరిశీలించారు.

About The Author