నవతరానికి ఏపీ టీడీపి పగ్గాలు…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా రాము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర #తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా #కింజరాపుఎర్రన్నాయుడు తనయుడు ,యువనేత ,శ్రీకాకుళం ఎంపీ #కింజరపురామ్మోహన్నాయుడు ని నియమించనున్నట్లుగా తెలుస్తోంది.రాష్ట్ర రాజధానిలోని ఆ పార్టీ వర్గాలలో ఈ చర్చ కొనసాగుతుంది. కొద్దిరోజుల్లో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపి టిడిపి అధ్యక్షుడుగా #కిమిడికళావెంకటరావును నియమించారు. ఆయన ఆ భాద్యతలను నిర్వహిస్తూ పార్టీలో అందరిని కలుపుకుని ముందుకు సాగారు.ముఖ్యమంత్రి తో పాటు ఆచప తనయుడు నారా లోకేష్ తో కూడా సత్ససంబంధాలను కొనసాగిస్తూ ఆ పదవి బాధ్యతలను వివాదాలకు తావు లేకుండా నిర్వరిస్తూ వచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విదంగా దెబ్బతింది.ఈ నేపధ్యంలో పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెడుతుంది.అందులో భాగంగా పార్టీలో యువతకు పెద్ద పీట వేయడం ద్వారా టిడిపికి పూర్వవైభం తీసుకువచ్చేలా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన రామ్మోహన్‌నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో #శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రామ్మోహన్‌నాయుడు ఎం.పిగా విజయం సాధించిన విషయం తెలిసిందే.యువతలో ఇమేజ్ ఉన్న రామ్మోహన్ నాయుడుకి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెడితే బి.సిలతో పాటు ,యువతను కూడా ఆకర్షించే అవకాశం ఉంటుందని చంద్రబాబు బావిస్తున్నట్లగా తెలుస్తుంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.