మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించిన సీఎం శ్రీ కేసీఆర్…

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కంటే ముందు.. మేడిగడ్డ వద్ద నిర్వహించిన హోమంలో గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

About The Author