ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తయిన, భారీ కాళేశ్వరం ఎత్తిపోతుల ప్రాజెక్టు…


ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తయిన, భారీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టి ప్రారంభించి కేవలం మూడేళ్లలో దానిని పూర్తిచేసిన మహనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు .. తెలంగాణ జాతి చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ గారి ఖ్యాతి వర్ధిళ్లుతుంది. తెలంగాణ దశ – దిశను మార్చే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభిస్తూ అందులో భాగమయిన అన్నారం బ్యారేజ్ ను నా చేతుల మీదుగా ప్రారంభించేందుకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రిగా తెలంగాణ రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి పాలమూరు రైతాంగం తరపున ఇది నాకు దక్కిన గౌరవంగా, అరుదయిన అవకాశంగా భావిస్తున్నాను.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని అన్నారం బ్యారేజి వద్ద గంగమ్మకు జలపూజ, బ్యారేజీకి పూజలు నిర్వహించి గేటు స్విచ్ ఆన్ చేసి బ్యారేజీని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుని నిరంతర శ్రమించిన అధికారులను సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యేలు గువ్వల బాల్ రాజు గారు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ గారు, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి గారు తదితరులు.

About The Author