సిద్ధిపేట జిల్లాలో 46 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులు 10/10 జీపీఏ…
సిద్ధిపేటలో 10వ తరగతిలో పదికి పది గ్రేడ్ పాయింట్స్ సాధించిన 42 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్.ఆర్.ఐల సహకారంతో ప్రోత్సాహకంగా నగదు బహుమతి.
– 10 వతరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాభినందనలు.
– జిల్లాలో 100 శాతం ఫలితాలు సాధించిన 219 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు.
– జిల్లాలో 46 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులు 10/10 జీపీఏ సాధించడం గొప్ప విషయం..
– ఈ ఫలితాలు సాధించిన 46 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ 25000 చొప్పున నగదు బహుమతి ఇవ్వడానికి ముందుకు వచ్చిన నా NRI మిత్రులకు ధన్యవాదాలు..
– వచ్చే విద్యాసంవత్సరం 100 మంది విద్యార్థులకు 25000 చొప్పున పారితోషికం అందిస్తాం..
– తెలంగాణ ప్రభుత్వం లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుత ఫలితాలు సాధించడం శుభపరిణామం.. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టె పరిస్థితి రావడం గర్వంగా ఉంది..
– ఇది ప్రతిభకు చేస్తున్న సత్కారం..
– వచ్చే విద్యాసంవత్సరం 100 శాతం ఫలితాలు సాధించాలి..సిద్ధిపేట జిల్లా ఖ్యాతి ని నిలబెట్టాలి.
– గత సంవత్సరం జిల్లలో ని ప్రభుత్వ పాఠశాల ల ఉపాధ్యాయులు గొప్పగా పనిచేశారు..
– సామాన్య పేద విద్యార్థులను సాన బట్టి గొప్ప ఫలితాలు సాధించారు..
– లక్ష్యం ఉంటేనే లక్ష్యం సిద్ధిస్తుంది..100 శాతం ఫలితాలు సాధించేందుకు జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలి..
– గత సంవత్సరం మూడవ స్థానం..ఈ సంవత్సరం రెండవ స్థానము లో ఉన్నాం.. వచ్చే వచ్చే సంవత్సరం మొదటి స్థానంలో ఉండాలి..