వాడి వలలో పడ్డ అమ్మాయిలు డాక్టర్లు, ఇంజినీర్లు…


వాడి వలలో పడ్డ అమ్మాయిలు డాక్టర్లు, ఇంజినీర్లు,..
పెళ్లి పేరుతొ వాడుకోవడం,కోట్లు కొట్టేయడం…

వీడు చిన్నోడు కాదు.. అమ్మాయిలకు వల విసిరాడు అంటే చిక్కాల్సిందే. అయితే వాడు వల విసిరే అమ్మాయిలు బాగా డబ్బున్న వాళ్ళే.. అందుకే కోట్లకు కొట్లు కొట్టేశాడు.. ఊరికో పేరు…ఒక్కో యువతి వద్ద ఒక్కో తీరు. డాక్టర్, ఇంజినీర్, రియల్‌ వ్యాపారి…ఇలా రకరకాల వృత్తులుగా ప్రచారం చేసుకుంటూ చలామణి, వివాహవేదికలు, పెళ్లికాని యువతులే పెట్టుబడిగా మోసాలకు పాల్పడుతున్న తిరువణ్ణామలైకి చెందిన చక్రవర్తి (35) పాపం పండటంతో జైలు పాలయ్యాడు.ఎంటెక్ చదివాడు. పెళ్ళై ఒక బిడ్డకూడా ఉంది..
ఇతని బారినపడి 9 మంది యువతులు రూ.10 కోట్లను పోగొట్టుకున్నారు. వివరాలు… చెన్నైలోని ప్రముఖ ప్రైవేటు ఆస్పపత్రిలో వైద్యురాలిగా పనిచేసే ఒక యువతి తన వివాహ ప్రయత్నాల్లో భాగంగా వివాహవేదిక వెబ్‌సైట్‌లో 2016లో వివరాలను నమోదు చేసుకుంది. తిరువణ్ణామలైకి సెల్వనాయగర్‌ నగర్‌కు చెందిన చక్రవర్తి (35) అనే యువకుడు సదరు వేదిక ద్వారా ఆమెకు ఫోన్‌లో పరిచయం అయ్యాడు. వివాహితుడైన విషయాన్ని దాచిపెట్టి తాను వాషింగ్టన్‌లో వైద్యునిగా పనిచేస్తున్నాని చెప్పడంతో అతడిని వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుంది. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ అతనిపై ప్రేమను పెంచుకుంది. చెన్నై క్రోంపేటలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు.
తాను తిరువణ్ణామలైలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయబోతున్నానని చెప్పడంతో రూ.6.90 కోట్లను అతడి వ్యాపారానికి సహాయం చేసింది. ఏడాది గడిచినా పెళ్లి ప్రస్తావన దాటవేస్తూ అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో వైద్యురాలు చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. 2014 మధురైలో ఇద్దరు యువతులను మోసం చేయడంతో అరెస్టయ్యాడు. అలాగే తిరుచ్చిరాపల్లి లాల్‌కుడికి చెందిన మరో యువతిని వాడుకుని రూ.18.70 లక్షలు కాజేయడంతో మరోసారి అరెస్ట్‌ చేశారు. ఇలా తమిళనాడు వ్యాప్తంగా ఇద్దరు వైద్యురాళ్లు, నలుగురు ఇంజినీర్లు, ఒక ఫిజియోథెరపిస్ట్‌ వైద్యురాలు, ఇద్దరు వితంతువులు, సహా మొత్తం 20 మంది యువతుల వరకు అతని వలలో చిక్కుకుని రూ.9 కోట్లకు పైగా మోసపోయారు.
కుంభకోణంలో ఒక ఇంజినీరుకు వలవేసి రూ.1.30 కోట్లు కాజేశాడు. పెళ్లి పేరుతో కాజేసిన డబ్బుతో తిరువన్ణామలై, వేలూరు, విళుపురం జిల్లాల్లో కొనుగోలు చేసిన అనేక ఇళ్లు, భూములు, 3 లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చక్రవర్తిపై ఇంకా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించాలని క్రైంబ్రాంచ్‌ పోలీసులు నిర్ణయించారు.

About The Author