ప్రేమ జంట ఆత్మహత్య…


మహబూబ్ నగర్ జిల్లా: కోయిల్ కొండ మండలం రాంపూర్ లో ఘోరం చోటు చేసుకుంది. మూడు నెలల కిందట ఇంట్లో నుంచి వెళ్లి పోయి ప్రేమికులు సమీప గుట్టలో చెట్టుకు ఉరి వేసుకొని కుళ్ళిన స్థితిలో కనిపించారు.మహబూబ్ నగర్ జిల్లా రాంపురం గ్రామానికి చెందిన రవి(19)డిగ్రీ సెకండ్ ఇయర్ రాధిక(20)డిగ్రీ థర్డ్ ఇయర్ చవుతున్న వీరు ఒకరికొకరు ప్రేమిoచుకున్నారు..అయితే గత మార్చి 23 న కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలిపారు.దింతో కుటుంబ సభ్యులు ఒకే కులానికి చెందిన వారి ప్రేమను ఒప్పకోకపోవడంతో ఇద్దరు ఇంట్లో నుoచి అదే రోజు హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే మరుసటి రోజు 24 వ తేదీన కోయిల్ కొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు వీరిపై మిస్సింగ్ కేసు కూడా పోలీసులు నమోదు చేసారు.అయితే నిన్న సాయంత్రం రాంకొండ సమీప గుట్టలో మేకల కాపరులు కుళ్ళి పోయి ఆత్మహత్య చేసుకుని కుళ్ళి పోయిన మృతదేహలని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించారు.దింతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేయగా రాంపురం గ్రామనికి చెందిన వారిగా గుర్తిoచారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. దింతో రాంపురం గ్రామంలో కూడ విషాదఛాయలు అలుముకున్నాయి….

About The Author